తిరుమల లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్.. ఏఆర్ డెయిరీకి నోటీసులు..
తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం ఇప్పటికే జోక్యం చేసుకోవడం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ.. ఏపీ సర్కార్ ను నివేదిక కోరడం జరిగింది.

Notice For AR Dairy (Photo Credit : Google)
Ttd Laddu Row : తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకి చెందిన ఏఆర్ డెయిరీకి నోటీసులు ఇచ్చింది FSSAI. నెయ్యి కల్తీ పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తిరుమలకు జూన్, జూలైలో ఏఆర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. అందులో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అయితే, తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదని ఏఆర్ డెయిరీ ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
తిరుమల లడ్డూ తయారీలో వాడేందుకు కోసం టీటీడీకి నెయ్యిని సప్లయ్ చేసిన ఏఆర్ డెయిరీ సంస్థకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులోని ఏఆర్ డెయిరీ సంస్థ కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. ఆ సోదాల్లోనూ కొంత కల్తీ నెయ్యి లభ్యమైనట్లుగా తెలుస్తోంది. తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం ఇప్పటికే జోక్యం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ.. ఏపీ సర్కార్ ను నివేదిక కోరడం జరిగింది.
మరోపక్క ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముఖ్యంగా.. వినియోగదారులు వాడే వస్తువుల నాణ్యతా ప్రమాణాలను ఈ సంస్థ పరిశీలిస్తూ ఉంటుంది. ఏఆర్ డెయిరీపై FSSAI చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏఆర్ డెయిరీ సంస్థ.. FSSAI కి నివేదిక ఇచ్చాక.. తదుపరి ఆ సంస్థపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నది ఇటు కన్జూమర్ అఫైర్స్, అటు హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి ఎటువంటి చర్యలు ఉంటాయి అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఆ వ్యక్తిని వదిలిపెట్టం..! శ్రీవారి ఆస్తుల అమ్మకంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
అటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ జరపాలంటూ వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అనేక మంది న్యాయవాదులు, జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్లు ఫైల్ చేస్తున్న పరిస్థితి ఉంది.