Jobs : 858 ఉద్యోగాలు భర్తీ.. నోటిఫికేషన్ విడుదల
ఏపీలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్‌ఓల ద్వారా పోస్టుల భర్తీకి..

Jobs
Jobs : ఏపీలోని పలు జిల్లాల్లో నేషనల్ హెల్త్ మిషన్(NHM) కింద ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం ఎన్‌హెచ్‌ఎం ప్రాజెక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్‌ఓల ద్వారా ఈ పోస్టుల భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Best Drinks : శరీరంలో కొవ్వును తగ్గించే పది పానీయాలు..
* మొత్తం ఖాళీలు: 858 పోస్టులు
* స్పెషలిస్టులు-53
* మెడికల్ ఆఫీసర్లు-308
* స్టాఫ్ నర్సులు-324
* ల్యాబ్ టెక్నీషియన్లు-14
* పారామెడికల్ స్టాఫ్-90
* కన్సల్టెంట్లు-13
* సపోర్ట్ స్టాఫ్-56.
అర్హత:
* పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/ బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్/ టీఎంఎల్‌టీ/ బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
Rs 800 KG Bhindi : ఈ బెండకాయలు కిలో రూ.800.. ఎందుకంత కాస్ట్లీ అంటే
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకి చివరి తేది: 2021, సెప్టెంబర్ 15.
చిరునామా: సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి.