ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును తొలగించిన అధికారులు
ఢిల్లీలోని ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు తొలగించారు. తాజాగా ఐ లవ్ ఏపీ అని బోర్డును ఏర్పాటు చేశారు.

ఢిల్లీలోని ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు తొలగించారు. తాజాగా ఐ లవ్ ఏపీ అని బోర్డును ఏర్పాటు చేశారు.
ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంతో ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్ ముందున్న ఐ లవ్ అమరావతి బోర్డును అధికారులు తొలగించారు. సోమవారం ఆ ప్లేస్ ఖాళీగా కనబడింది. అధికారులు నిన్న ఐ లవ్ ఏ అనే అక్షరాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తాజాగా ఐ లవ్ ఏపీ అని బోర్డును ఏర్పాటు చేశారు.
ఏపీలో మూడు రాజధానుల అంశంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మరోవైపు టీడీపీ..మూడు రాజాధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. అలాగే అమరావతి రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడతున్నారు. రాజధాని తరలింపు, మూడు రాజధానుల ఏర్పాటుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు.