Kesineni Nani : విజయవాడ నాదే.. మరోసారి కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

కొన్ని సంవత్సరాల నుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అన్నింటికి తట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారని కేశినేని చెప్పారు. Kesineni Nani - Vijayawada

Kesineni Nani - Vijayawada (Photo : Twitter)

Kesineni Nani – Vijayawada : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెడతానని విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ బేగ్ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాని పిలుపునిచ్చారు. బేగ్ విజయం కోసం తాను కష్టపడతానని ఆయన చెప్పారు. అందరి సహకారంతో మరోసారి ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగు పెడతానని అన్నారు.

పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్ లో తెలుగు దేశం నేత ఎంఎస్ బేగ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. టీడీపీ నేతలు ఎంపీ నానిని భారీ గజమాలతో సత్కరించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసిన అనంతరం ఎంపీ నాని మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశంను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ఎంఎస్ బేగ్ కు అభినందనలు తెలిపారు. మాజీమంత్రి బేగ్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం పని చేశారని నాని చెప్పారు.

Also Read..Kamineni Srinivas: కామినేని శ్రీనివాస్ మైండ్‌గేమ్‌తో కైకలూరు టీడీపీలో కలవరం!

కొన్ని సంవత్సరాల నుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అన్నింటికి తట్టుకుని పార్టీ కోసం నిలబడ్డారని కేశినేని చెప్పారు. నగరంలో జరిగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో తను అందుబాటులో లేకపోయినా పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్తలు పాదయాత్రను విజయవంతం చేశారని కేశినేని నాని తెలిపారు.