Visakha Online Rummy Gang : ఆధార్, పాన్ కార్డుల డేటాలు సేకరిస్తూ మోసాలు

ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆన్ లైన్ రమ్మీ గ్యాంగ్ మోసాలను స్థానికులు బట్టబయలు చేశారు. మహిళల్ని టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

Visakha Online Rummy Gang : ఆధార్, పాన్ కార్డుల డేటాలు సేకరిస్తూ మోసాలు

Visakha Online Rummy Gang

Updated On : June 20, 2021 / 12:14 PM IST

Online Rummy Gang :ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆన్ లైన్ రమ్మీ గ్యాంగ్ మోసాలను స్థానికులు బట్టబయలు చేశారు. మహిళల్ని టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ రమ్మీ లాగిన్ అవ్వాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డు డేటాలు సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంట్లో భాగంగా..మహిళల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వేలి ముద్రలు ఇస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపెడుతున్నారు. డబ్బులు ఎర వేసి డేటాలు సేకరిస్తున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వేలి ముద్రలు ఇస్తే రూ500లు ఇస్తామని ఆశపెడుతున్నారు.

ఈ క్రమంలో ఓ యువకుడిపై అనుమానం వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని అదుపలోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఈ ఆన్ లైన్ రమ్మీ గ్యాంగ్ మోసాలు బయటపడ్డాయి. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

ఆన్ లైన్ రమ్మీ.. పేకాట వచ్చిన నెటిజన్లకు ఇది సుపరిచితమే. ఈక్రమంలో విశాఖపట్నం జిల్లాలో ఈ దందాలు జరుగుతుండటంతో పలువురు మోసపోతున్నారు. చిన్న చిన్న మొత్తాలు ఆశపెట్టి మహిళల నుంచి డేటాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగ మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా గత భారత్ అంతటా లాక్ డౌన్ కారణంగా అన్నీ కార్యకలాపాలు ఆగిపోయిన కారణంగా ఇంట్లోనే ఉండాల్సిన జనాలకు తోచిన ఒక గేమ్ ఆన్ లైన్ రమ్మీ. ఈ ఆన్ లైన్ రమ్మీ మనకు తెలియని వ్యక్తితో కలిసి డబ్బులు పెట్టి జూదం ఆడటం. భారీగా డబ్బులు పోగొట్టుకోవటం ఆనక లబోదిబోమనటం సర్వసాధారణంగా మారిపోయింది. ఫేక్ ఐడిలతో కూడా ఆటలే ఆడుతూ మహిళ నుంచి డేటాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. కేవలం రూ.500లకు ఆశపడి కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. డేటాలను ఇచ్చి మోసపోతున్నారు.