×
Ad

TTD: అటు పరకామణి కేసు.. ఇటు కల్తీ నెయ్యి ఎపిసోడ్.. ఏం జరుగుతోంది?

పరకామణిలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని కాపాడేందుకు గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులే దగ్గరుండి వ్యవహారాన్ని నడిపించారని, చివరకు కేసు పెట్టినా కూడా లోక్‌ అదాలత్‌లో కొట్టేసేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపణలున్నాయి.

TTD

TTD: ఆ రెండు కేసులు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయ్. కోట్లాది మంది భక్తుల విశ్వాసం..భక్తుల కొంగుబంగారంగా ఉన్న తిరుమల శ్రీవారి..కొండ చుట్టూ తిరుగుతున్న ఆ రెండు ఇష్యూస్‌పై రచ్చ కంటిన్యూ అవుతోంది. పరకామణి చోరీ కేసు అయితే బిగ్ టర్న్ తీసుకుంది. పరకామణి చోరీ కేసులో నిందితులను ఎప్పుడో గుర్తించారు. అతడి ఆస్తులపై దర్యాప్తు నడుస్తోంది. కీలక సాక్షిగా ఉన్న సతీష్‌కుమార్‌ అనే అధికారి అనుమానాస్పద మృతి చెందడంతో పరకామని కేసు క్లైమాక్స్‌లో బిగ్ టర్న్ తీసుకున్నట్లు అయ్యింది.

ఇక హుండీ చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకరెడ్డి, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీఐడీ విచారించింది. ప్రశ్నలు వేసి ఏం జరిగిందనే దానిపై ఆరా తీసింది. పరకామణి చోరీ చేసిన రవికుమార్ ఆస్తుల జప్తులో ఏం జరిగింది.? ఎంత చోరీ జరిగితే..ఎన్ని ఆస్తులు జప్తు చేశారు.? రాజీ కుదర్చిందెవరు.? ఎవరి ఒత్తిడి వల్ల ఇదంతా చేశారని.? ఆరా తీస్తుంది సీఐడీ. నిందితులతో భూమన, ధర్మారెడ్డి, వైవీసుబ్బారెడ్డికి ఉన్న లింకులపై కూపీ లాగుతోంది. ఈ క్రమంలోనే సంచలనం సృష్టించిన టీటీడీ పరకామణి కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు సీఐడీ అధికారులు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సీఐడీ మూడుసార్లు ప్రశ్నించింది. (TTD)

పరకామణిలో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని కాపాడేందుకు గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులే దగ్గరుండి వ్యవహారాన్ని నడిపించారని, చివరకు కేసు పెట్టినా కూడా లోక్‌ అదాలత్‌లో కొట్టేసేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపణలున్నాయి. ఇదంతా జరగడానికి కోట్లు చేతులు మారాయనే అభియోగాలు లేకపోలేదు. ఈ క్రమంలో అన్ని కోణాల్లో దర్యాప్తు అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు అతిపెద్ద చిక్కుముడిగా మారింది. కీలక సాక్షి లేటెస్ట్‌గా మృతి చెందడంతో కేసు మరింత జఠిలం అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. పరకామణి కేసులో కూడా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి సీఐడీ నుంచి పిలుపురావడం రకరకాల చర్చకు దారితీస్తోంది.

Also Read: కొత్త ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌కు కాంగ్రెస్‌ కొత్తగా ఉందా? ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు, నేత‌లు రాకపోవడానికి రీజనేంటి?

ఇక తిరుమల కల్తీ నెయ్యి కేసు కూడా కొత్త టర్న్ తీసుకుంటోంది. సుప్రీం ఆదేశాలతో ఏర్పాటైన స్పెషల్ సిట్‌..ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను అరెస్ట్ చేసింది. లేటెస్ట్‌గా వైవీ సుబ్బారెడ్డిని కూడా హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ప్రశ్నించింది స్పెషల్ సిట్‌ టీమ్. అయితే 2019 నుంచి 2014 వరకు జరిగిన నెయ్యి సరఫరాపై మాత్రమే ఎందుకు విచారణ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి.

గత పదేళ్లలో నెయ్యి సప్లైపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ ఆరోపణలపై పాలీ గ్రాఫ్ పరీక్షకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన సుబ్బారెడ్డి..రాజకీయాలకు ఆలయాలను వాడుకుంటున్నారని ఆరోపించారు. స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విషప్రచారం చేస్తున్నారని..కల్తీ నెయ్యి వ్యవహారంలో లైడిటెక్టర్‌ టెస్టుకైనా సిద్ధమని అంటున్నారు వైవీ సుబ్బారెడ్డి. తనకు కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఉండగా..నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తానని ప్రశ్నిస్తున్నారు. పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదంటున్న వైవీ సుబ్బారెడ్డి..శ్రీవారి సేవలో నీతి నిజాయితీతో పనిచేశానని చెప్తున్నారు.

కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం
అటు దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతుండగానే..ఏపీ ప్రభుత్వం మాత్రం నిందితుల పట్ల కఠినంగా ఉంటామని తేల్చి చెబుతోంది. తప్పుచేసిన వారిని శ్రీవారు వదిలిపెట్టరని..శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తోంది. అయితే కల్తీ నెయ్యి కేసులో సిట్..పరకామణి కేసులో సీఐడీ దర్యాప్తు స్పీడప్ అవడం ఉత్కంఠ రేపుతోంది. ఓవైపు విచారణ కొనసాగుతుండగానే..ఓవైపు కల్తీ నెయ్యి..ఇంకోవైపు పరకామణి వ్యవహారంపై.. కూటమి, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కూటమి లీడర్లు రియాక్ట్‌ అవడం..తామేం తప్పు చేయలేదని వైసీసీ లీడర్లు వివరణ ఇచ్చుకుంటుండం..హాట్ టాపిక్‌గా నడుస్తోంది. పరకామణి కేసుతో పాటుకల్తీ నెయ్యి ఇష్యూలో కూడా వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఇద్దరు విచారణను ఫేస్‌ చేస్తుండటం వైసీపీకి హెడెక్‌గా మారింది. భూమన కరుణాకరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి చుట్టూ ఈ రెండు కేసుల విచారణ కొనసాగుతుండటం బర్నింగ్‌ టాపిక్ అవుతోంది.

అయితే ఈ ముగ్గురు వైసీపీ అధినేతకు జగన్‌కు సన్నిహితులు. వైవీ సుబ్బారెడ్డి అయితే జగన్‌కు బాబాయ్‌ అవుతారు. భూమన వైఎస్సార్‌ నుంచి జగన్‌ వరకు వాళ్ల ఫ్యామిలీ వెంట నడిచిన నేత. ఇక ధర్మారెడ్డి వైసీపీ హయాంలో టీటీడీలో అన్నీ తానై వ్యవహరించారు. ఈ ముగ్గురిని కార్నర్ చేసి..జగన్‌ను రాజకీయంగా వీక్ చేయాలని కూటమి కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది వైసీపీ. పరకామణి కేసు..కల్తీ నెయ్యి ఎపిసోడ్‌లో కన్‌క్లూజన్‌ ఎప్పుడో వేచి చూడాలి మరి.