Andhra Pradesh : బిగ్ బ్రేకింగ్ : ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ..హైకోర్టు తీర్పును వెలువరిచింది. ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ వ్వాలంటూ..ఆదేశాలు జారీ చేసింది.

Ap High Court
Parishad Elections : ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ..హైకోర్టు తీర్పును వెలువరిచింది. ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ వ్వాలంటూ..ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 4 వారాల కోడ్ అమలు నిబంధన ఉల్లంఘించారని అభిప్రాయం వ్యక్తం చేసింది.
పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించాలేదని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ సంవత్సరం ఏప్రిల్ 01వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చిందని టీడీపీ సింగిల్ జడ్జీ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ…ఏప్రిల్ 06వ తేదీన మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.
అయితే..వీటిని సవాల్ చేస్తూ..ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్ పై ఏప్రిల్ 07వ తేదీన విచారణ జరిపింది ధర్మాసనం. షెడ్యూల్ ప్రకారం 08వ తేదీన ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చి…ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆపివేసింది. పిటిషన్ పై లోతైన విచారణ జరిపే వ్యవహారాన్ని సింగిల్ జడ్జీకి అప్పగించింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన మూడు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఈ నెల 04వ తేదీన తుది విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
Read More : Allu Sirish : అల్లు శిరీష్ మేకోవర్ అదిరిందిగా..!