Pawan Kalyan : నేను కులాలు రెచ్చగొట్టడానికి పార్టీ పెట్టలేదు, కడపలో కౌలు రైతు భరోసాలో పవన్ కళ్యాణ్

జననసేన ఒక కులానికి సంబంధించినది కాదు. అన్ని కులాలను గుర్తించాలని నా ఉద్దేశం. అన్ని కులాలకు సాధికారత రావాలి.

Pawan Kalyan : నేను కులాలు రెచ్చగొట్టడానికి పార్టీ పెట్టలేదు, కడపలో కౌలు రైతు భరోసాలో పవన్ కళ్యాణ్

Updated On : August 20, 2022 / 6:51 PM IST

Pawan Kalyan : ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జిల్లాలోని సిద్ద‌వ‌ఠంలో ఏర్పాటు చేసిన ర‌చ్చ‌బండ‌లో ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతుల కుటుంబాల‌కు చెక్కులు పంపిణీ చేశారు. సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందులకు చెందిన కౌలు రైతుల కుటుంబాల‌కు చెక్కుల‌ను అందించ‌డంతోనే ప‌వ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఉమ్మ‌డి క‌డ‌ప‌ జిల్లాలో మొత్తం 170 మందికి పైగా కౌలు రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌గా.. వారి కుటుంబాల‌కు రూ.ల‌క్ష చొప్పున ప‌వ‌న్ ఆర్థిక సాయం అందించారు. వ్య‌వ‌సాయం క‌లిసి రాక‌ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌కు అండ‌గా నిలిచే ఉద్దేశంతో కౌలు రైతు భ‌రోసా పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని పవన్ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

”కొండల నడుమ మధ్యనున్న సిద్దవఠంలో నేను పుట్టి ఉంటే ఎంత బాగపండేదో అనుకుంటున్నా. కొండల ప్రాంతంలో ఇంత అందమైన సుందరమైన ప్రాంతంలో ఇంత కరువు ఏంటని భాదపడుతున్నా. సిద్దులు తిరిగిన ఈ ప్రాంతంలో 190 మంది కౌలు రైతులు చనిపోయారు. లక్ష రూపాయలు వారి జీవితాలు మారుస్తాయని ఇవ్వడం లేదు. మీకు భరోసాగా ఉన్నామని ఇస్తున్నాం. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ పోరాటాలు, ఆధిపత్యాల దగ్గరే ఆగిపోయాము.

రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు పని చేసినా వారు బాగుపడ్డారు కానీ ప్రజలు బాగుపడలేదు. రాష్ట్రం కులాల సమూహం. నేను ఎప్పుడు కులాల గురించి మాట్లాడలేదు. వైసీపీ నాయకుల ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికే మేలు జరుగుతుందనే నానుడి ఉంది.
కానీ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ ఉండటం బాధగా ఉంది. నేను కులాలు రెచ్చగొట్టడానికి పార్టీ పెట్టలేదు. చదువుల నేలపై మద్యం ఏరులై పారుతోంది. జగన్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. జగన్ వైసీపీకి ముఖ్యమంత్రి తప్ప రాష్ట్రానికి కాదు. కౌలు రైతులకు ఎందుకు గుర్తింపు కార్డులు ఇవ్వరు? ఎంబీఏ చదిన వ్యక్తికి ఉపాధి లేదు.

జనసేన మద్దతుదారులకు నా విజ్ఞప్తి. జననసేన ఒక కులానికి సంబంధించినది కాదు. నేను వ్యక్తులపై పోరాడను. భావంపై పోరాడతాను. వైసీపీకి సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. ఆరోజు అన్నయ్య పదవుల కోసం పార్టీలో పని చేయలేదు. జాతీయ పార్టీలో కలిపినా మాట్లాడలేదు. ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రులు, మంత్రులుగా చేసిన వారు పార్టీని విలీనం చేయించారు. లేదంటే ఈరోజు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉండేది.

ప్రాణం పోయినా నమ్మిన సిద్ధాంతాన్ని వీడను. వారసత్వ రాజకీయాలు రూపుమాప లేము. కానీ ఎంతో కొంత అడ్డుకట్ట వేయాలి. మైదుకూరు నుంచి వస్తున్న ఒక వికలాంగ నాగేంద్ర కుటుంబాన్ని కూడా బెదిరించడానికి ఎలా మనసొచ్చింది? వైసీపీ నేతలకు సిగ్గు ఉందా? సిగ్గుంటే ఇలా బెదిరిస్తారా? నాగేంద్రకు ఉగ్యోగం ఇప్పించే బాధ్యత నాది.

ఒక చెల్లి అన్న కోసం తిరిగింది. ఆ చెల్లే వేరే పార్టీ పెట్టింది. ఒకే కుటుంబం నుంచి ఒకే కులం నుంచి వచ్చి రెండు పార్టీలు పెట్టి వారే అధికారం కోసం తపన పడుతున్నారు. రాయలసీమలో ఉన్న మాదిగ, మాల, బీసీలు, బలిజల గురించి ఎవరైనా ఆలోచిస్తారా? నేను ఒక కులానికి మద్దతివ్వను. కొమ్ము కాయను. నేను కులాన్ని అమ్మడానికి, కార్యకర్తలను అమ్మడానికి రాలేదు.

ఏపీలో నాయకులకు ఒక్కొక్కరికి కుల పిచ్చి మొదలైంది. రెడ్డి సామాజిక వర్గాన్ని తగ్గించడం నా ఉద్దేశం కాదు. అన్ని కులాలను గుర్తించాలని నా ఉద్దేశం. అన్ని కులాలకు సాధికారత రావాలి. ఎంపీ గోరంట్ల మాధవ్ చేసింది నాకు నచ్చలేదు. దానికి కులాలను అంటకట్టారు. పార్టీ నడపడానికి చాలా ఓర్పు, సహనం కావాలి” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

 

కడప జిల్లాలో కౌలు రైతు భరోసా రచ్చబండి..