Janasena Party : పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. కేరళలో జనసేన పార్టీ విస్తరణకు సమాలోచనలు..
Janasena Party : జనసేన పార్టీని కేరళ రాష్ట్రంలో విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టిసారించారు.
Pawan Kalyan
Janasena Party : జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టిసారించారు. ఏపీలో అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపడుతున్న పవన్.. కేరళ రాష్ట్రంలోనూ జనసేన పార్టీ విస్తరణపై దృష్టిసారించారు.
Also Read : Pawan Kalyan : ఆపరేషన్.. ఆపరేషన్ అంటున్నారు.. అసలు పవన్ కళ్యాణ్ కి ఏమైంది?
తిరువనంతపురం జనసేన నేతలతో జనసేన పార్టీ ఎమ్మెల్సీ కె. నాగబాబు, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ సమావేశమయ్యారు. కేరళలో జనసేన పార్టీని విస్తరించాలని స్థానిక నాయకుల నుంచి అభ్యర్థనలు వస్తున్నందున ఆ రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. పవన్ ఆదేశాల మేరకు స్థానిక నేతలతో నాగబాబు, తాళ్లూరి రామ్ సమావేశమయ్యారు. భవిష్యత్తులో కేరళ రాష్ట్రంలో జనసేన బలోపేతం కోసం చేపట్టబోయే అంశాలపై సమాలోచనలు చేశారు.
