Pawan Kalyan Deeksha : పవన్ కళ్యాణ్ ఒకరోజు దీక్ష

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సంఘీభావంగా...ఆయన దీక్ష చేయనున్నారు.

Pawan Kalyan Deeksha : పవన్ కళ్యాణ్ ఒకరోజు దీక్ష

Pawan

Updated On : December 10, 2021 / 6:03 PM IST

Visakhapatnam Steel Plant Privatization : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సంఘీభావంగా…ఆయన దీక్ష చేయనున్నారు. 2021, డిసెంబర్ 12వ తేదీన జరిగే ఈ దీక్ష మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే దీక్షకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దంటూ…గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమం జరుగుతోంది. అయినా..కేంద్రం వెనక్కి తగ్గలేదు.

Read More : Chiru 154: బాబీ సినిమాకీ లీకుల బెడద.. వాల్తేరు శీనయ్య కథ ఇదేనా?

ఈ మేరకు అన్ని రకాల చర్యలను కూడా ప్రారంభించేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ గళం విప్పారు. ఇటీవలే..ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర పెద్దలను కలిసి..విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. కార్మికులకు అండగా ఉండేందుకు ఈ దీక్షను చేపడుతున్నట్లు పవన్ వెల్లడించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు విశాఖలో పవన్ పర్యటించారు. బహిరంగసభ నిర్వహించి…ఉద్యమానికి మద్దతు తెలియచేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఢిల్లీలో కూడా ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు వైసీపీ ఎంపీలు మద్దతు పలికారు.

Read More : Nandamoori వారి పెళ్ళిసందడి.. నారా, దగ్గుబాటి కుటుంబాల కలయిక!

ప్రైవేటీకరణ కానున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని దక్కించుకునేందుకు పలు స్వదేశీ కంపెనీలు కూడా ఆసక్తిగా ఉండగా టాటా టాటా కంపెనీ కూడా సిద్ధంగా ఉందని ప్రకటించింది. దేశీయ ఉక్కు దిగ్గజంగా పేరున్న టాటా స్టీల్‌.. వైజాగ్ స్టీల్ ను దక్కించుకునేందుకు సిద్దమవుతుంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.వి. నరేంద్రన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 22 వేల ఎకరాల భూములున్నాయి. ఈ ప్రైవేటీకరణ అంశం హైకోర్టుకు కూడా చేరింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కీలక అఫిడవిట్ దాఖలు చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉండదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను కూడా తొలగిస్తామని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. వంద శాతం స్టీల్‌ ప్లాంట్‌ పెట్టుబడులను ఉపసంహరించుకోబోతున్నట్లు తెలిపిన కేంద్రం.. ఇప్పటికే బిడ్డింగులను ఆహ్వానించినట్టు అఫిడవిట్‌లో ఏపీ హైకోర్టుకు వెల్లడించింది. తాజాగా పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీక్ష అనంతరం ఆయన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే ఉత్కంఠ నెలకొంది.