Pawan Kalyan
Pawan Kalyan : రాబోయే ఎన్నికల్లో పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి కార్యకర్త అభిప్రాయం మేరకే పొత్తు ఉంటుందని, జన సైనికుల ఆలోచన తెలుసుకున్నాకే 2024లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయిస్తామని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమకు బీజేపీతో పొత్తు ఉందని వెల్లడించారు.
ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని, అయినప్పటికీ తానొక్కడినే పొత్తుపై నిర్ణయం తీసుకోలేనని పవన్ తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తుంటాయని, అయితే ఆయా రాజకీయ పార్టీల ఎత్తుగడల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, వారి మైండ్ లో పడొద్దని జనసైనికులు సూచించారు పవన్. వచ్చే ఎన్నికల నాటికి ఒకే మాటపై ఉండాలని పవన్ అన్నారు.
”రకరకాల పార్టీలు మనతో పొత్తు కోరుకోవచ్చు. అయితే, జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. పొత్తుల కంటే ముందు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాం. ఇతర పార్టీలతో పొత్తుపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని పవన్ అన్నారు. ‘వన్ సైడ్ లవ్’ అని జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
YS Jagan : జగన్‌కు రిలీఫ్.. సాక్షిలో పెట్టుబడులపై అనుకూల తీర్పు
ఇటీవల రష్యా పర్యటన ముగించుకుని వచ్చిన జనసేనాని పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై హాట్ కామెంట్స్ చేశారు.