Chandrababu : చిరంజీవి పార్టీ పెట్టకుంటే.. అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం..! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం అన్నారాయన. అసలు టీడీపీ సీన్ మరోలా ఉండేదన్నారు చంద్రబాబు.

Chandrababu : చిరంజీవి పార్టీ పెట్టకుంటే.. అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లం..! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Chiranjeevi

Chandrababu : మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టకుండా ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదా? ప్రజారాజ్యం పార్టీ రాకుండా ఉంటే టీడీపీ సీన్ మరోలా ఉండేదా? సినీ పరిశ్రమ ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీకి సహకారం ఇచ్చింది లేదా? అంటే, అవుననే అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన సినిమా టికెట్ ధరల వివాదంపై స్పందించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2008లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే 2009లో అధికారంలోకి వచ్చేవాళ్లమని చంద్రబాబు అన్నారు. అసలు టీడీపీ సీన్ మరోలా ఉండేదన్నారు చంద్రబాబు. చిరంజీవి వల్లే తాము ఓడిపోయామని చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు.

YS Jagan : జగన్‌కు రిలీఫ్.. సాక్షిలో పెట్టుబడులపై అనుకూల తీర్పు

”సినీ పరిశ్రమ తెలుగుదేశం పార్టీకి సహకరించింది లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు కూడా సహకారం లేదు. నాకు వ్యతిరేకంగా సినిమాలు తీశారు. సినిమా టిక్కెట్ల వివాదంలోకి అనవసరంగా తెలుగుదేశం పార్టీని లాగుతున్నారు. చిరంజీవి పార్టీ పెట్టకుంటే 2009లో అధికారంలోకి వచ్చేవాళ్లం. కాగా, చిరంజీవి పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా నాతో బాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగం” అని చంద్రబాబు అన్నారు.

చిరంజీవి పార్టీని, సినీ పరిశ్రమను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లోనే కాదు సినీ పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదంపై స్పందించిన చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా టిక్కెట్ల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి.. భవన నిర్మాణంపై మాట్లాడరని విమర్శించారు. సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఇష్టానుసారం ధరలు పెంచుకుంటున్నారని ఆరోపించారు. నిన్న-మొన్న కూడా భారతీ సిమెంట్ ధరలు పెంచుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ రెడ్డి పీడితులే అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేక కళ తప్పిందని వాపోయారు.

Turmeric : పసుపు తీసుకునే విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే?

కాగా, టీడీపీ నుంచి ఈ-పేపర్ వచ్చింది. దాని పేరు ‘చైతన్య రథం’. ఎన్టీఆర్ భవన్ లో ఈ-పేపర్ ను చంద్రబాబు లాంచ్ చేశారు. ‘చైతన్య రథం’ పేరిట ఈ-పేపర్ రూపకల్పన చేశారు. టీడీపీ నుంచి వచ్చిన ఈ-పేపర్.. ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా చంద్రబాబు అభివర్ణించారు.