Pawan Kalyan : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు మళ్లింపు దురదృష్టకరం : పవన్ కళ్యాణ్

విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం.. నిధులను మళ్లించడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. హెల్త్ యూనివర్సిటీ నిధులు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎందుకంత ఆత్రం అన్నారు.

Pawan Kalyan : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు మళ్లింపు దురదృష్టకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan (1)

Updated On : November 14, 2021 / 8:07 PM IST

NTR Health University funds : విశ్వ విద్యాలయాలను మెరుగైన రీతిలో నడిపించి ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం ఆ విద్యాలయాల నిధులను మళ్లించుకోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హెల్త్ యూనివర్సిటీ నిధులు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎందుకంత ఆత్రం అని ప్రశ్నించారు. ఏపీలో తలమానికమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిధులు ప్రభుత్వ అవసరాలకు తీసుకోవడానికి విశ్వ విద్యాలయం పాలక మండలిపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. పాలకులు ఆ విద్యాలయం దగ్గర ఉన్న వాటినే గుంజుకోవాలనుకోవడాన్ని విద్యావేత్తలు, వైద్య నిపుణులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

హెల్త్ యూనివర్సిటీ దగ్గర మిగులు నిధులుగా ఉన్న రూ.450 కోట్లలో రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణా వాటా రూ.170 కోట్లు వెళ్లిపోతాయని పేర్కొన్నారు. ఉన్న నిధుల్లో నుంచి ఏపీ ప్రభుత్వం రూ.250 కోట్లు తీసుకుంటే మిగిలేది రూ.30 కోట్లు మాత్రమేనని.. వీటితో ఏం సాధిస్తారని నిలదీశారు. ఈ నిధులు మళ్లించాలని కీలక బాధ్యతల్లో ఉన్నవారే ప్రయత్నించడంతోనే అత్యవసరంగా పాలకమండలి సమావేశం అయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

CM Jagan : దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం.. ఏపీ విభజన హామీల అమలు అంశాన్ని ప్రస్తావించిన సీఎం జగన్

ఈ రూ.250 కోట్ల కోసం ప్రభుత్వం ఎందుకింత ఆత్రపడుతోంది? ఈ సొమ్ములను ఏ ప్రయోజనం కోసం ఖర్చు చేస్తారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఈ సొమ్ములను ఎస్ఎఫ్ఎస్ సిలో డిపాజిట్ చేసినా తిరిగి ప్రభుత్వం చెల్లించగలదా అనే సందేహాలు హెల్త్ యూనివర్సిటీ వర్గాల్లో నెలకొన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆర్థిక స్థితి వల్లే అందరికీ అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఈ సందేహాలను నివృతి చేయాలని కోరారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతోపాటు రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు ఉన్న నిధులు, వాటి నిర్వహణపై జనసేన పార్టీ పరిశీలన చేస్తుందన్నారు.