janasena: త్వరలోనే పవన్ వారాహి యాత్ర మొదలు.. ఏపీ రోడ్లలాగే రాష్ట్ర పరిస్థితి: నాగబాబు
రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు నాగబాబు ఆదివారం అనంతపురం పట్టణంలో పర్యటించారు. అక్కడి కలెక్టరేట్ నుంచి చెరువుకుట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్లే దారి అధ్వానంగా ఉండటంతో ఆ రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే ఏపీలో వారాహి యాత్ర మొదలుపెడతారని వెల్లడించారు ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, నటుడు నాగబాబు. రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు నాగబాబు ఆదివారం అనంతపురం పట్టణంలో పర్యటించారు. అక్కడి కలెక్టరేట్ నుంచి చెరువుకుట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్లే దారి అధ్వానంగా ఉండటంతో ఆ రోడ్డును పరిశీలించారు.
Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్య కేసు.. 3000 పేజీల ఛార్జిషీటు సిద్ధం చేసిన పోలీసులు
ఈ కార్యక్రమంలో నాగబాబు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే, జనసేన రోడ్లు బాగు చేయాలనుకున్న నేపథ్యంలో రాత్రికిరాత్రే అధికారులు నిధులు మంజూరు చేసి, ఈ రోడ్లను ప్రభుత్వం బాగు చేస్తోందని నాగబాబు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. వైసీపీ ప్రభుత్వం పోలీసుల సహకారంతో జనసేనను ఇబ్బంది పెట్టినంత మాత్రాన మా పార్టీ కార్యక్రమాలు ఆగవు. సీఎం జగన్ ఎలాగూ రోడ్లు వేయరు. అందుకే జన సైనికులు రోడ్లు వేయాలని భావించారు. అయితే, ఏదో ఒక కారణం చెప్పి ఇలాంటి మంచి పనిని కూడా ప్రభుత్వం అడ్డుకుంటోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలోనే వారాహి వాహనంతో యాత్ర మొదలుపెడతారు.
PM Modi: మోదీ అధ్యక్షతన 29న కేంద్ర క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ
ఈ యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలో పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుంటారు. ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు’’ అని నాగబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు నాగబాబు పర్యటనపై స్థానిక పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్ల మరమ్మతుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. ఈ ఆంక్షలపై నాగబాబు, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార రథమైన ‘వారాహి’కి ఈ నెల 24న కొండగట్టులో వాహన పూజ చేయించబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని కొండగట్టులో ఈ మంగళవారం ఆయన పూజ నిర్వహిస్తారు. తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. తర్వాత ఆయన ప్రచార యాత్ర మొదలయ్యే అవకాశం ఉంది.
అనంతపురంలో కలెక్టరేట్ నుంచి చెరువుకట్ట మీదుగా బుక్కరాయ సముద్రం వెళ్ళే దారి అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ. వరుణ్ నేతృత్వంలో శ్రీ నాగబాబు గారు స్వయంగా పాల్గొని గుంతలు పూడుస్తారని తెలిసి అప్పటికప్పుడు రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. pic.twitter.com/lF0tv4DVAu
— JanaSena Party (@JanaSenaParty) January 22, 2023