Peacock Dance: అడవి కాలిపోయినా అక్కడే… పురివిప్పి నాట్యమాడుతోంది నెమలి….

చిత్తూరులో జిల్లాలో రామానాయునికోట శివారులో పొలాల మధ్య నెమలి తిరుగుతోంది. అందరిని ఆకట్టుకుంటోంది. పురివిప్పి నాట్యమడుతూ సందడి చేస్తోంది.

Peacock Dance: అడవి కాలిపోయినా అక్కడే… పురివిప్పి నాట్యమాడుతోంది నెమలి….

Peacock Dance Attracting Locals, After Forest Catched Fire Years Ago

Updated On : April 12, 2021 / 1:09 PM IST

Peacock Dance Attracting Locals : చిత్తూరులో జిల్లాలో నెమలి అందరిని ఆకట్టుకుంటోంది. పురివిప్పి నాట్యమడుతూ సందడి చేస్తోంది. ములకలచెరువు మండలం పెద్దపాళెం పంచాయతీ రామానాయునికోటలోని ఓ వీధిలోకి నెమలి వచ్చింది. నెమలి పురివిప్పి నాట్యమాడి అందరినీ ఆకట్టుకుంది. మూడేళ్ల క్రితం సమీపంలోని అడవి మంటల్లో  కాలిపోయింది. ఆ సమయంలో అడవిలోని నెమళ్లన్నీ సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాయి.

అందులో ఒక నెమలీ మాత్రం రామానాయునికోట శివారులో పొలాల మధ్య తిరుగుతోంది. అప్పుడప్పుడు గ్రామంలోకి వస్తోంది. గ్రామస్థులు నెమలికి గింజలు, నీళ్లు పెట్టేవారు. రోజు గ్రామ వీధుల్లోకి వచ్చి పురివిప్పి నాట్యమాడుతు సందడి చేస్తోంది. నెమలిని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.