Perni Nani
Perni Nani Ration Rice Case : వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పేరుతో నిర్మాణం చేసిన గోడౌన్ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన పౌర సరఫరాల సంస్థ బియ్యం భారీగా గల్లంతైనట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దాదాపు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యం గల్లంతయ్యాయినట్లు గుర్తించారు. దీని మొత్తం విలువ రూ. 3.37కోట్లకు పైగా ఉంటుంది. అయితే, ఇప్పటికే రూ.1.70 కోట్లు పేర్ని నాని కుటుంబం నుంచి అధికారులు వసూలు చేశారు. ఇంకా రూ. 1.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. గోడౌన్ లో రేషన్ బియ్యం మాయంపై అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పేర్నినాని సతీమణితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.
Also Read: Richest CM: దేశంలోనే రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు.. అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరంటే?
నలుగురు అరెస్ట్.. 14రోజులు రిమాండ్..
గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి గోడౌన్ మేనేజర్ మానస్ తేజ, సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, రైసు మిల్లర్ ఆంజనేయులును సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించారు. అరెస్టయిన వారిపై 316 (3), 316 (5), 61 (2), రెడ్ విత్ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదైంది. వారిని రాత్రి సమయంలో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చగా.. 14రోజులు వారికి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు.
Also Read: Murali Mohan : మహేశ్ బాబు ‘అతడు’ కథ మురళీమోహన్‌కు నచ్చలేదా..? మరీ సినిమా ఎలా తీశారు?
విచారణలో వెలుగులోకి కీలక విషయాలు..
అరెస్టైన వారిని పోలీసులు విచారణ చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేర్ని కుటుంబం వద్ద మానస్ తేజ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు మేనేజర్ హోదా కల్పించారు. మానస్ తేజ, మిల్లర్లకు మధ్య, కార్పొరేషన్ సహాయ మేనేజరుకు మధ్య రూ. లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం లక్షల్లో నిలవలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వీరు ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా చెల్లింపులు జరిపినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. అయితే, బందరులోని ఇన్వెస్టరు గోదాముల నుంచి బియ్యం ప్రతి నెలా కాకినాడ గోదాములకు తరలించినట్లు, ఇందుకు సంబంధించిన ఆదారాలను పోలీసులు కనుగొనట్లు సమాచారం. అయితే, ఈ ఒక్క మిల్లరే ఇలా చేశారా..? ఇంకా మరికొంత మంది ఉన్నారా అనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మేనేజరు మానస్ తేజను కస్టడీకి కోరే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read: Ration Rice Case : రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. మరో ఇద్దరి అరెస్ట్
పేర్నినాని సతీమణికి ఊరట..
మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని కుటుంబానికి ఊరట లభించింది. ఆయన సతీమణి జయసుధకు మచిలీపట్నం కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలాఉంటే.. రేషన్ బియ్యం షార్జేజీకి సంబంధించి పేర్ని నాని సతీమణి జయసుధకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ. 1.67 కోట్లు చెల్లించాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.