Murali Mohan : మహేశ్ బాబు ‘అతడు’ కథ మురళీమోహన్‌కు నచ్చలేదా..? మరీ సినిమా ఎలా తీశారు?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు’.

Exclusive Interview Murali Mohan talks about Mahesh Babu Athadu movie
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు’. త్రిష కథానాయిక. ఈ చిత్రాన్ని ‘జయభేరి ఆర్ట్స్’ బ్యానర్ పై డి.కిషోర్, మురళీమోహన్, ఎం.రామ్ మోహన్ లు కలిసి నిర్మించారు. 2005 వ సంవత్సరం ఆగష్ట్ 10న ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా.. అతడు సినిమా తనకు నచ్చలేదని, తాము తీయదగ్గ సబ్జెక్టు కాదని మురళీమోహన్ అనుకున్నారు అనే వార్తలు అప్పట్లో వచ్చాయి. దీనిపై తాజాగా 10 టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ స్పందించారు.
అతడు కథను త్రివిక్రమ్ దాదాపు మూడు గంటలు చెప్పాడని, షాట్ టూ షాట్ చెప్పారన్నారు. కథ చాలా బాగుందని, అయితే.. ఆఖర్లో తనకు ఓ అనుమానం వచ్చిందన్నారు. సినిమా మొదట్లో హీరో నెగెటివ్ క్యారెక్టర్ ఉంటుందని అది తనకు నచ్చలేదన్నారు.
Game Changer: గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌కు చిరంజీవి, పవన్ కల్యాణ్?
‘అప్పుడు.. నా తమ్ముడు కిషోర్, దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కటే చెప్పారు. మీరు ఇంటర్నేషనల్ సినిమాలు చూడండి. మీరు చెప్పినట్లుగా సర్వగుణ సంపన్నుడిగా హీరో ఉండాలి అని అనుకుంటే ఈ రోజుల్లో కుదరదు అండి. నెగెటివ్‌ది కూడా ఉండాలి. ఆ నెగెటివ్ ని పాజిటివ్‌గా ఎలా చేసుకున్నారు అనేది ఈ రోజు ట్రెండ్ అని చెప్పారు. నేను సరేనని అన్నాను. అంతే తప్ప కథ నచ్చలేదని కానీ, నేను అసంతృప్తిగా మూవీని చేయడం అనేది జరగలేదు.’ అని మురళీమోహన్ అన్నారు.
అతడు మూవీ తరువాత జయభేరీ బ్యానర్ నుంచి మరో సినిమా రాలేదు. దీనిపైనా మురళీమోహన్ మాట్లాడారు. అప్పుడు తాను రాజకీయాల్లో బిజీ అయ్యానని, తన తమ్ముడు, కొడుకు వ్యాపారంలో బీజీగా ఉండడంతో సినిమాలు తీయలేదన్నారు. సినిమా అనేది వేయికళ్లతో చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎవరో ఎంప్లాయిస్ మీద పెట్టి సినిమా తీయమంటే ఆ సినిమా ఎలా ఉంటుందో తెలియదని అన్నారు. అందుకనే కాస్త గ్యాప్ తీసుకుందామని అనుకున్నామని, అలా అలా.. 12 ఏళ్లు దాటిపోయిందన్నారు. సినిమా తీయకపోయినా ఫర్వాలేదని, చెడ్డ సినిమా తీస్తే ఇలాంటి సినిమాలు తీశారు ఎంటి అని అంటారన్నారు. వచ్చే ఏడాది జయభేరీ బ్యానర్‌లో ఓ చిన్న సినిమా తెరకెక్కే అవకాశం ఉందన్నారు.