Katha Kamamishu Trailer : ‘కథా కమామీషు’ ట్రైలర్.. నవ్వులే నవ్వుల్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
'కథా కమామీషు అనే ఓ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది ఆహా.

Katha Kamamishu Trailer out now
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందశాతం తెలుగు కంటెంట్‌తో ఓటీటీ ఫీల్డ్‌లో దూసుకుపోతుంది. ప్రతీవారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ‘కథా కమామీషు’ అనే ఓ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
ఇంద్రజ, కృతికా రాయ్, వెంకటేష్ కాకుమాను లు కీలక పాత్రల్లో నటించారు. జనవరి 2 నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతరం నవ్వులే ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతంలోని ప్రేమ, కుటుంబ నేపథ్యంలో చిత్రం రూపుదిద్దుకున్నట్లుగా ట్రైలర్‌ను బట్టి అర్థం అవుతోంది. చిన్నా వాసుదేవర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతాన్ని అందించారు. గౌతమ్-కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.