Pawan Kalyan : ఓజీ చిత్రంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ అరుపులు బెదిరింపుల్లా వున్నాయి.. : పవన్ కళ్యాణ్
ఓజీ చిత్రంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ వైపు తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరో వైపు ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మూవీ ఓజీ. ఈ చిత్రంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ చిత్రం 1980-90ల మధ్య జరిగే కథ అని చెప్పారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అని చెప్పారు.
ఇక ఇటీవల తాను ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు ఓజీ.. ఓజీ అంటూ అని అరుస్తున్నారు అని, అవి తనకు బెదిరింపుల్లా వినిపిస్తున్నాయన్నారు. తాను ఒప్పుకున్న సినిమాలు అన్నింటికి డేట్స్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే.. ఆయా చిత్రాల వాళ్లు తన డేట్స్‌ను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేయపోయారన్నారు.
Murali Mohan : శ్రీ సింహాతో రాగ పెళ్లి.. నా మనవరాలే మొదట ప్రపోజ్ చేసింది : మురళీమోహన్
ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మరో ఎనిమిది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఒక చిత్రం తరువాత మరొకటి ఇలా అన్ని సినిమాలు పూర్తి చేస్తానన్నారు. మంగళగిరిలో సోమవారం విలేకరులతో జరిగిన చిట్‌చాట్‌లో తన చిత్రాలపై పవన్ మాట్లాడారు.
ఓజీ మూవీ విషయానికి వస్తే సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోండగా శ్రియారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.