Murali Mohan : శ్రీ సింహాతో రాగ పెళ్లి.. నా మనవరాలే మొదట ప్రపోజ్ చేసింది : మురళీమోహన్
సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీ సింహాల పెళ్లి ఇటీవల ఎంతో ఘనంగా జరిగింది

Murali Mohan About Sri Simha Koduri And Raga Maganti Marriage
సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీ సింహాల పెళ్లి ఇటీవల ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాలు డ్యాన్సులు, ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు.10 టీవీ ఇంటర్వ్యూలో మురళీమోహన్ ఈ పెళ్లి గురించి మాట్లాడారు. ఈ వివాహం విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పెళ్లికి ముందు నుంచే రాగ, శ్రీసింహాలు మంచి ఫ్రెండ్స్ అని, ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు తన మసులో మాటను రాగ బయటపెట్టిందన్నారు.
రాజమౌళి కోడలు పూజా, రాగ మంచి ఫ్రెండ్స్. వీలు కుదిరినప్పుడు రాగ వాళ్లింటికి వెళ్లేదని చెప్పారు. ఈ క్రమంలో కీరవాణి, రాజమౌళి కుటుంబాలు ఎంత బాగా కలిసి ఉంటున్నాయో ఆమె చూసేది. ఇక చిన్నప్పటి నుంచి రాగకు ఉమ్మడి కుటుంబాలు ఎంతో ఇష్టం ఉండడంతో వారి కుటుంబాన్ని ఎంతో ఇష్టపడిందని మురళీ మోహన్ చెప్పారు.
Pushpa 2 : బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న పుష్పరాజ్ హవా.. 25 రోజుల్లో ఎంతంటే..?
ఓ రోజు శ్రీసింహకు రాగనే ప్రపోజ్ చేసిందన్నారు. ఈ విషయాన్ని మొదట్లో మాకు చెప్పలేదన్నారు. ఓ సారి మా ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. అప్పుడు నీకు నచ్చినవాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగాం. అప్పుడు తన మసులోని మాట బయటపెట్టిందన్నారు.
కీరవాణి కుమారుడు శ్రీసింహను ఇష్టపడ్డాను మీరందరూ అనుమతిస్తే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. మా ఫ్యామిలీ అంతా ఓకేం చెప్పాం అని అన్నారు. ఇక పెళ్లిలో రాజమౌళి, కీరవాణి కుటుంబ సభ్యుల చొరవ చూసి ఎంతో ముచ్చేసిందన్నారు. సాదారణంగా వధువు తరుపు వారు పల్లకిమోస్తూ మండపానికి తీసుకువెళ్లాలి. అయితే.. కీరవాని పెద్ద కొడుకు కాలభైరవ తో పాటు మిగిలిన వారంతా కలిసి రాగను పల్లకిని పై మోసుకెళ్లారన్నారు. దీన్ని చూసి ఎంతో సంతోషమేసిందన్నారు.
మురళీ మోహన్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు రామ్‌మోహన్- రూపల కూతురే రాగ. ఇక కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ మత్తు వదలరాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ కనిపించారు.