Ration Rice Case : రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. మరో ఇద్దరి అరెస్ట్

మానస తేజ అకౌంట్‌ నుంచి పేర్ని నాని సతీమణి జయసుధ అకౌంట్‌కు నగదు బదిలీ అయినట్టు కనుగొన్నారు.

Ration Rice Case : రేషన్ బియ్యం మిస్సింగ్ కేసు.. మరో ఇద్దరి అరెస్ట్

Updated On : December 31, 2024 / 12:09 AM IST

Ration Rice Case : రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో సివిల్‌ సప్లయ్ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డి, గోడౌన్ మేనేజర్ మానస తేజతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 316 (3), 316 (5), 61 (2), రెడ్‌ విత్‌ 3 (5) సెక్షన్ల కింద కేసు చేశారు. అటు కాకినాడ పోర్టు బియ్యం బోకర్ల నుంచి రూ.94 లక్షలు A2 మానస తేజ బ్యాంక్ ఖాతాకు వచ్చినట్టు గుర్తించారు పోలీసులు.

ఆపై మానస తేజ అకౌంట్‌ నుంచి పేర్ని నాని సతీమణి జయసుధ అకౌంట్‌కు నగదు బదిలీ అయినట్టు కనుగొన్నారు. గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామానికి చెందిన వ్యక్తిని చీరాలలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి A2గా ఉన్న మానస తేజ బ్యాంక్ అకౌంట్‌కు రూ.30 లక్షలు నగదు బదిలీ అయినట్టు గుర్తించారు పోలీసులు.

Also Read : జగన్ టార్గెట్‌గా పవన్ దూకుడు.. రాయలసీమపైనే ఫోకస్..! రాయలసీమలో క్యాంప్‌ ఆఫీస్‌ పెట్టబోతున్నారా?

మరో కోటి 70 లక్షలు చెల్లించాలని నోటీసులు..
ఇదిలా ఉండగా రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ మరోసారి పేర్నినాని భార్య జయసుధకు నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం స్కామ్ లో కోటి 70 లక్షల రూపాయల చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై పేర్నినాని హైకోర్టును ఆశ్రయించారు. ఆ నోటీసులను కొట్టివేయాలని ఆయన కోరారు.

అటు రేషన్ బియ్యం మాయం స్కామ్ కు సంబంధించి గోడౌన్ మేనేజర్ మానస తేజను పోలీసులు విచారిస్తున్నారు. సివిల్ సప్లయ్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డిని కూడా పోలీసులు విచారించారు.

గోడౌన్ లోనే బియ్యం మాయం అయ్యాయి అంటూ తొలుత ఫిర్యాదు చేసింది ఆయనే. అయితే, తాను తప్పించుకోవడానికే కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దాని ఆధారంగా గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లయ్స్ అసిస్టెంట్ మేనేజర్ ను పోలీసులు విచారిస్తున్నారు. బియ్యం ఎలా మాయం అయ్యాయి? ఎవరు తీసుకెళ్లారు? మీరు ఎప్పుడు గమనించారు? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.