AP Politics
AP Politics: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై ఉద్దేశ పూర్వకంగా మీడియా, వాట్సప్ గ్రూప్ లో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది ఎవరో చేసిన కిరాతక చర్య అని అభివర్ణించారు. మనుషులైతే ఇలాంటి ప్రచారాలు చేయరని చెప్పారు. తమ పార్టీ తరపున అభ్యర్థి ఓట్లను కోఆర్డినేట్ చేసే బాధ్యత తనకు ఉందని అన్నారు.
తన గ్రూప్ లో కృష్ణ ప్రసాద్ లేరని పేర్ని నాని తెలిపారు. ఆయనను తాను ఎందుకు అడుగుతానని నిలదీశారు. కృష్ణ ప్రసాద్ ఉదయం 8.45 గంటలకే అసెంబ్లీకి వచ్చారని చెప్పారు. టీ బ్రేక్ టైంలో ఓటు వేశారని అన్నారు. కృష్ణ ప్రసాద్ పై దుష్ప్రచారం చేస్తున్న వారు అయన వ్యక్తిగత శత్రువులో, పార్టీ పరంగా లాభం పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారో తెలియదని చెప్పారు. దీన్ని ఖండిస్తున్నామని అన్నారు.
అనంతరం, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. పేర్ని నాని, వసంత నాగేశ్వరరావు మంచి స్నేహితులని చెప్పారు. పేర్ని నాని తన కన్నా రాజకీయాల్లో సీనియర్, మంత్రిగా పని చేశారని అన్నారు. తనకు ఏ సమస్య ఉన్నా పేర్ని నానికి చెప్పేవాడినని తెలిపారు. తనది నలుగురితో ఘర్షణ పడే మనస్తత్వం కాదని అన్నారు. జీవితకాలం తమ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కొందరు గిట్టని వారు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాళ్లు ఎవరో తనకు తెలుసని అన్నారు.
Adhra Pradesh High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయశాఖ మంత్రి