Andhra Pradesh High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయశాఖా మంత్రి

ఆంధ్రప్రదేశ్ (Adhra Pradesh) హైకోర్టు (High Court) తరలింపుపై రాజ్యసభలో  కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది.

Andhra Pradesh High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయశాఖా మంత్రి

Adhra Pradesh High Court

Adhra Pradesh High Court : ఆంధ్రప్రదేశ్ (Adhra Pradesh) హైకోర్టు (High Court) తరలింపుపై రాజ్యసభలో  కేంద్రం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ (Adhra Pradesh)పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు (High Court)అమరావతి (amaravati)లో ఏర్పాటైందని స్పష్టం చేసింది కేంద్ర న్యాయశాఖ. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో గురువారం (మార్చి 23,2023) రాజ్యసభలో కేంద్ర న్యాయ శాఖ ఏపీ హైకోర్టు తరలింపుపై రాజ్యసభలో సమాధానం ఇస్తూ..ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ (TDM MP kanakamadala Ravindra kumar)అడిగిన ప్రశ్నకు.. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు (law minister kiren rijiju) లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరాలు బయటపెట్టారు. హైకోర్టును కర్నూలుకు తరలిచాంలంటే హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది కేంద్ర న్యాయ శాఖ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోనే ఉందని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం.

రాజ్యాంగంలోని 214 నిబంధన, 2018లో కేంద్రం వర్సెస్ దన్ గోపాల్ రావు మరియు ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ పునర్విజన్ చట్టం 2014 ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటు అయిందని రాజ్యసభలో స్పష్టం చేసింది కేంద్ర న్యాయశాఖ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వముతో సంప్రదింపుల తర్వాతే… పునర్విజన చట్టం ప్రకారం ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేసినట్లు సమాధానం చెప్పిన కేంద్రం ఏపీ సీఎం జగన్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదించారని తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రం హైకోర్టు తరలింపుతో పాటు సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదల్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయని గుర్తు చేసింది.హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని పేర్కొంది.

కాగా..ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించి అధికారంలోకి వచ్చాక ఏపీకి మూడు రాజధానులు అని ప్రకటించి యావత్ రాష్ట్రాన్ని షాక్ కు గురిచేశారు. ఈ ప్రకటతో రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తు రోడ్డెక్కారు. అప్పటినుంచి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు వద్దని..అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతు సంవత్సరాల తరబడి ఆందోళన కొనసాగిస్తున్నారు. పాదయాత్రలు చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి గురించి కేసు విచారణ కొనసాగుతున్నా..వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు చేసిన తీరుతామని పదే పదే చెబుతోంది. సీఎం జగన్ పదే పదే విశాఖే పాలనా రాజధాని అంటూ..తాను కూడా విశాఖ షిఫ్ట్ అవుతున్నానంటూ పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నా జగన్ పదే పదే ఈ మాట అనటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నాయి ప్రతిపక్షాలు.