Konaseema Violence : అమలాపురం అల్లర్లు.. 46 మందిపై కేసులు.. జాబితాలో బీజేపీ, కాపు ఉద్య‌మ నేత‌లు

అమ‌లాపురంలో అల్ల‌ర్ల‌ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్ప‌టిదాకా 46 మందిపై(Konaseema Violence)

Konaseema Violence : కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో జ‌రిగిన అల్ల‌ర్ల‌ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్ప‌టిదాకా 46 మందిని గుర్తించిన పోలీసులు వారిపై కేసులు న‌మోదు చేశారు. ఆ 46 మందిపై పలు సెక్లన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మ‌రింత మందిపైనా కేసులు న‌మోదు చేసే దిశ‌గా పోలీసులు సాగుతున్నారు. ఇప్ప‌టిదాకా న‌మోదైన కేసుల్లో బీజేపీ కోన‌సీమ జిల్లా కార్య‌ద‌ర్శి సుబ్బారావు, అదే పార్టీకి చెందిన నేత రాంబాబు, కాపు ఉద్య‌మ నేత న‌ల్లా సూర్య‌చంద‌ర్ రావు కుమారుడు అజ‌య్ ఉన్నారు.(Konaseema Violence)

Tension In Amalapuram : అట్టుడుకుతున్న అమలాపురం.. మంత్రి క్యాంప్ ఆఫీస్, బస్సుకు నిప్పు.. పోలీసులపై రాళ్ల దాడి

Amalapuram

* ఆందోళనకారులపై 307, 143, 144, 147, 148, 151, 152, 332, 336, 427, 188, 353 r/w 149 IPC, 3, 4 PDPPA, 32 PA-1861 సెక్షన్ల కింద కేసు నమోదు.
* సామర్లకోటకి చెందిన వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై కేసు నమోదు
* వజ్ర వెహికల్ లో గత రెండేళ్లుగా హోంగార్డుగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం
* కాపు ఉద్యమ నేత నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్‌పై కేసు
* బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావుపై కేసు నమోదు చేసిన పోలీసులు
* కోనసీమలో విధ్వంసంపై మరో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు సమాచారం.(Konaseema Violence)

Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Konaseema

46 మందిపై పోలీసు కేసు..
నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, థింక్ యాడ్ సావుకారు, దున్నల దిలీప్, అడప శివ, అసెట్టి గుడ్డు, చిక్కల మధుబాబు, దువ్వ నరేశ్, లింగోలు సతీశ్, నల్ల నాయుడు, నక్క హరి, కిశోర్, దొమ్మేటి బబ్లూ, నల్ల పృథ్థి, మోకా సుబ్బారావు, ఐళ్ల నాగ వెంకట దుర్గా నాయుడు, అడప సత్తిబాబు, నల్ల రాంబాబు, యెళ్ల రాధ, గాలిదేవర నరసింహ మూర్తి, సమసాని రమేశ్, కడలి విజయ్, తోట గణెశ్, అన్యం సాయి, దూలం సునీల్, కలవకొలను సతీశ్, కనిపుడి రమేశ్, ఎదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పొలిశెట్టి కిశోర్, నల్ల కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మడిశెట్టి ప్రసాద్, వినయ్(కలవకొలను స్ట్రీట్), శివ(Ganapathi Lodge), సదనాల మురళి, నల్ల అజయ్, వాకపల్లి మణికంఠ, కసిన పణీంద్ర, కొండేటి ఈశ్వర రావ్, అరిగెల తేజ, అరిగెల వెంకట రామారావు, రాయుడు స్వామి.

Amalapuram Violence

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అమ‌లాపురం కేంద్రంగా కోన‌సీమ జిల్లాను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ జిల్లా పేరును అంబేద్క‌ర్ జిల్లాగా మార్చాలంటూ ద‌ళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ప‌లు రాజ‌కీయ పార్టీలు కూడా ఇదే వాద‌న‌ను వినిపించాయి.(Konaseema Violence)

Konaseema Tension : అమలాపురంలో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు

ఈ క్ర‌మంలో జిల్లా పేరును డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మారుస్తూ ఇటీవ‌లే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంత‌రాల కోసం 30 రోజుల గ‌డువు ఇచ్చింది. జిల్లా పేరు మార్పును వ్య‌తిరేకిస్తున్న మరో వర్గం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇది ఊహించని విధంగా అల్లర్లకు దారితీసింది. ఆందోళనలు, నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్ల దాడి చేశారు.(Konaseema Violence)

Amalapuram Tension

అంతేకాదు మంత్రి విశ్వ‌రూప్‌, ముమ్మిడివ‌రం ఎమ్మెల్యే, కోన‌సీమ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు పొన్నాడ‌ స‌తీశ్ ఇళ్ల‌కు నిప్పు పెట్టారు. మూడు బస్సులను దగ్ధం చేశారు. దీంతో ప్రశాంతతకు మారుపేరు అయిన కోనసీమ ఒక్కసారిగా భగ్గుమంది. జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం అల్లర్లు, విధ్వంసాలతో అట్టుడికింది. రణరంగాన్ని తలపించింది. అమలాపురం అల్లర్ల వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుముకుంది.

ట్రెండింగ్ వార్తలు