Nara Lokesh yuvagalam : నారా లోకేష్‌, యువగళం టీమ్‌పై కేసులు నమోదు

తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. లోకేష్ తో పాటు యువగళం టీమ్ పై కూడ కేసులు నమోదు చేశారు.

Nara Lokesh yuvagalam : నారా లోకేష్‌, యువగళం టీమ్‌పై కేసులు నమోదు

lokesh yuvagalam

Updated On : September 2, 2023 / 4:32 PM IST

Nara Lokesh yuvagalam padayatra : తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల పోలీస్ స్టేషన్లో నారా లోకేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. లోకేష్ తో పాటు యువగళం టీమ్ పై కూడ కేసులు నమోదు చేశారు పోలీసులు. శుక్రవారం (సెప్టెంబర్ 1,2023)నారా లోకేశ్ పాదయాత్రలో సీఎం జగన్ ఫ్లెక్సీని దగ్గరుండి చింపించారని వైసిపి శ్రేణులు ఫిర్యాదు చేయటంతో లోకేష్‌తో పాటు యువగళం బృందంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జగన్ ఫ్లెక్సీని చింపింని ఘటనా స్థలంలో వైసీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు లోకేశ్, ఆయన బృందంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Gandham Pallam Raju : అమలాపురంలో మరోసారి విధ్వంసం.. పల్లం రాజు ఆఫీస్ కు నిప్పుపెట్టిన దుండగులు

కార్యకర్తలను లోకేష్ రెచ్చగొట్టి, ఉసిగొల్పుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు శుక్రవారం రాత్రి నల్లజర్ల సెంటర్ లో వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు చేయి చేసుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంట్లో భాగంగా తిమ్మన్న పాలెంలో ఫ్లెక్సీ చింపినందుకు 341,427,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా..తిమ్మన్నపాలెంలో వైకాపా నాయకులు ఆందోళన చేస్తుంటే కారులో వచ్చి గొడవచేయ బోయి నందుకు 341,323,506 Rw 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.అలాగే నల్లజర్ల లో వైసీపీ నేత ఇంటి వద్ద దాడికి సంబందించి ఘటనపై 324,323,Rw 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.