Anantapur News: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు
ఓ కేసు విచారణలో పామిడి సీఐ వ్యవహరించిన తీరు విమర్శకులు తావిస్తుంది. ఓ కేసు విచారణలో నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్ లో జరిగింది.

Anantapur News
Anantapur News: ఓ కేసు విచారణలో పామిడి సీఐ వ్యవహరించిన తీరు విమర్శకులు తావిస్తుంది. ఓ కేసు విచారణలో నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ ఘటన అనంతపురం జిల్లా పామిడి పోలీస్ స్టేషన్ లో జరిగింది. పామిడి సీఎం శ్యామ్ రావు ఓ స్థలం వివాదంలో స్టేషన్ కి వచ్చిన పురుషోత్తంపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు తెలుస్తుంది. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
పామిడిలోని నాయీ బ్రాహ్మణ కాలనీలో స్థల వివాదానికి సంబంధించి ఈ నెల 13న పురుషోత్తం వర్గీయులు జరిపిన దాడిలో రఘునాథ్, చౌడప్ప గాయపడ్డారు. ఈ కేసులో పురుషోత్తం, పుల్లయ్య, భీమన్న, డ్రైవర్ సూరి, కృష్ణ, మహేష్, నాగేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను శనివారం స్టేషన్ కు తీసుకొచ్చారు. రాత్రి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సమయంలో పురుషోత్తం ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.
దీంతో వంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఈ సందర్భంగా పురుషోత్తం కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే తాను ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని, విచారణ సమయంలోనే అతను స్పృహ తప్పి పడిపోయాడంటూ సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని పురుషోత్తం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.