Prakasam : 10 గంటల్లో కేసు సుఖాంతం, తల్లి ఒడికి పసిపాప
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన శిశువు కేసు సుఖాంతమైంది. కిడ్నాప్‌నకు గురైన నాలుగు రోజుల పసిపాప ఆచూకీని 10 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు.

Child
Four Days Child : ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన శిశువు కేసు సుఖాంతమైంది. కిడ్నాప్‌నకు గురైన నాలుగు రోజుల పసిపాప ఆచూకీని 10 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. స్థానిక పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో పాపను గుర్తించి ఆమె తల్లి వద్దకు చేర్చారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More : CM Stalin: తనని పొగిడితే చర్యలు తప్పవు.. స్టాలిన్ మార్క్ వార్నింగ్!
నిందితులంతా కంభంనకు చెందిన వారిగా గుర్తించారు. సంతానం లేకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తక్కువ టైంలో చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసుల బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామానికి చెందిన కోమలి అనే గర్భిణి.. 24వ తేదీన ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Read More : Cat Rescue : గర్భంతో ఉన్న పిల్లిని పట్టారు, రూ.10లక్షలు సంపాదించారు
పాపకు కామెర్లు కావడంతో… ఫోటోథెరపీ ట్రీట్‌మెంట్ వార్డులో ఉంచారు. నాలుగు రోజులుగా అక్కడే చికిత్స అందిస్తున్నారు. శనివారం డిశ్చారికి రెడీ అవుతున్న సమయంలో పాప కనిపించకుండా పోయింది. బురఖా వేసుకున్న మహిళ పాపను అపహరించుకుపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి పాప ఆచూకీని గుర్తించారు.