Notice to SEC Nimmagadda : ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు నోటీసు?

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కాబోతోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.

Notice to SEC Nimmagadda : ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు నోటీసు?

Notice To Sec Nimmagadda

Updated On : March 17, 2021 / 6:34 PM IST

Notice to SEC nimmagadda? : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశం కాబోతోంది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ చర్చించనుంది.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు నోటీసులివ్వడంపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశముంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం జరుగనుంది.

గతంలో నిమ్మగడ్డ వ్యవహారంపై మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఒకసారి సమావేశం జరిగింది. ప్రాథమికంగా ఫిర్యాదును స్వీకరించిన ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. అయితే మరికాసేపట్లో మరోసారి ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది.

తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ సమావేశం జరుగనుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమను అవమానించే విధంగా, అలాగే తమ హక్కులకు భంగం కల్గించే విధంగా అనేక ఆరోపణలు చేస్తూ గవర్నర్ కు లేఖ రాయడాన్ని తప్పుబడుతూ మంత్రులిద్దరూ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.