AP Telangana Rains : తెలుగు ప్రజలకు చల్లని శుభవార్త : రాబోయే మూడు రోజుల్లో వర్షాలు
తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.

Rains In Telangana And Ap In The Next Three Days
Rains in Telangana and AP : తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు కిలోమీటర్ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఛతీస్‌గఢ్ , తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది.
తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అటు దక్షిణ కోస్తాంధ్రాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు, సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2 – 3 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.