Rajneesh Kumar : ఏపీ ఆర్థిక సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Ap Govt
AP Financial Advisor : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్లు ఆయన పనిచేయనున్నారు.
గతంలో ఇంగ్లాండ్, కెనడాలోని పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్ కుమార్ విధులు నిర్వహించారు. ఫిన్‌టెక్ సంస్థల్లో నిపుణుడిగా రజనీష్ ఉన్నారు. పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్ అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనను ఎంపిక చేసింది.