Chandrababu On Early Elections : ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే.. చంద్రబాబు నోట మరోసారి ముందస్తు మాట

ముందస్తు ఎన్నికలపై మరోసారి ప్రస్తావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పల్నాడులో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ముందస్తుకు సీఎం జగన్ రంగం సిద్ధం చేసుకున్నారనే తరహాలో..

Chandrababu On Early Elections : ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే.. చంద్రబాబు నోట మరోసారి ముందస్తు మాట

Updated On : October 19, 2022 / 11:04 PM IST

Chandrababu On Early Elections : ముందస్తు ఎన్నికలపై మరోసారి ప్రస్తావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పల్నాడులో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ముందస్తుకు సీఎం జగన్ రంగం సిద్ధం చేసుకున్నారనే తరహాలో పవన్ తో భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు. ఇవాళ పల్నాడు టూర్ లో చంద్రబాబు మరోసారి ముందస్తు ప్రస్తావన చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ముందస్తు కామెంట్స్ పై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పల్నాడు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు చంద్రబాబు. ముందుగా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లలో పత్తి రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. వర్షాలకు పంటలు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టంపై లెక్కలు సేకరించడానికి రాలేదని వివరించారు. పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని కన్నీరు పెట్టుకున్న రైతులను చంద్రబాబు ఓదార్చారు.