టీడీపీ మున్సిపల్ మేనిఫెస్టో విడుదల.. రూ.5కే పేదలకు భోజనం, పట్టణ పేదలందరికీ టిడ్కో గృహాల పంపిణీ

TDP Municipal Election Manifesto : టీడీపీ మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది. పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు పేరుతో మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య శుక్రవారం (ఫిబ్రవరి 26, 2021)న 10 వాగ్ధానలతో కూడిన మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
ఈ సంరద్భంగా నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించి వేశారని తెలిపారు. వారికి ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు. లొంగకపోతే వారికిచ్చే సంక్షేమ కార్యక్రమాలను తీసేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని అంశాలు..
కేవలం రూ.5కే పేదలకు కడుపునిండా భోజనం
పాత పన్నుల మాఫీ, చెల్లించాల్సిన బకాయిలు పూర్తిగా రద్దు
శుభ్రమైన ఊరు-శుద్ధమైన నీరు కోసం చర్యలు
నిరుద్యోగ యువత కోసం ఆరు నెలలకు ఓసారి ఉద్యోగ మేళా
చెత్తలేని నగరాల కోసం సుందరీకరణ మిషన్
ఆటో డ్రైవర్ల కోసం టాయిలెట్లు, తాగునీటి సౌకర్యంతో శాశ్వత ఆటో స్టాండ్లు
స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణ సదుపాయం
పట్టణ పేదలందరికీ టిడ్కో గృహాల పంపిణీ
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంపు
ప్రాథమిక హక్కుగా సురక్షిత తాగునీరు