ప్రేమించి మోసగించాడని ఎన్నికల్లో పోటీకి దిగిన యువతి

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 10:01 AM IST
ప్రేమించి మోసగించాడని ఎన్నికల్లో పోటీకి దిగిన యువతి

Updated On : March 14, 2020 / 10:01 AM IST

సమాజంలో చాలా మంది ప్రేమిస్తుంటారు…అందులో కొంతమంది యువతులను మోసం చేస్తుంటారు. ప్రేమించా..పెళ్లి చేసుకుంటా..అంటూ మగ్గులోకి లాగుతుంటారు. తీరా..ముఖం చాటేస్తుంటారు. దీంతో మోసపోయిన వారు..పోరాటాలు చేస్తుంటారు. తమకు న్యాయం చేయాలంటూ..పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేస్తుంటారు. ప్రేమికుడి నివాసాల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తుంటారు. కానీ ఓ యువతి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించింది. ఏకంగా ఎన్నికల బరిలో నిలిచింది. అతడు చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడుతోంది. ఈ ఘటన ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హాడావుడి నెలకొంది. టీడీపీ, వైసీపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే…తూర్పుగోదావరి జిల్లా…అమలాపురంలో తనను ఓ వైసీపీ లీడర్ కుమారుడు ప్రేమించి..మోసం చేశాడంటూ..ఆ యువతి ఆరోపిస్తోంది. మున్సిపాల్టీ పరిధిలోని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికల్లో పోటీకి దిగింది. అమలాపురంలోని సూర్యానగర్‌కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి బీసీ మహిళకు కేటాయించిన 15వ వార్డులో నామినేషన్ వేశారు. 

తనకు న్యాయం జరగకపోవడం వల్లే..ఎన్నికల అస్త్రాన్ని ఉపయోగించినట్లు ఆ యువతి వెల్లడిస్తోంది. తనకు జరిగిన అన్యాయాన్ని గడపగడపకు వెళ్లి చెబుతానని, ప్రేమికుడికి బుద్ధి చెబుతానంటోంది. ఈ అంశం వైసీపీ వర్గాల్లో హాట్ హాట్ చర్చకు దారి తీసింది.

Read More : కరోనాపై భట్టి విక్రమార్క కామెంట్స్..కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్