Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.. నలుగురు పరిస్థితి విషమం
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మరణించగా.. నలుగురికి గాయాలయ్యాయి.
Road Accident
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మరణించగా.. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. టాటా ఏస్ వాహనంతోపాటు మూడు బైకులను ఢీకొట్టి చెట్టును ఢీకొని ఆగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
