Roja birthday gift for YS Jagan mohan reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖుల నుంచి ఆయనకు ఇప్పటికే శుభాకాంక్షలు అందగా.. లేటెస్ట్‌గా సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా.. ఎమ్మెల్యే రోజా ఏం గిఫ్ట్ ఇచ్చారంటే.. తల్లి దండ్రులు కోల్పోయి చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఓ పేద విద్యార్థిని చదువులకు సంబంధించిన బాధ్యతను తీసుకున్నారు.
ఈ మేరకు ఓ లేఖ రాసిన ఆమె.. మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! అంటూ జగన్ పుట్టిన రోజున.. ఆయనకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటనే విషయాన్ని వెల్లడించింది. మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది. అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఐనవాళ్లందరిని కోల్పోయిన చిన్నారికి కొత్త జీవితం ఇచ్చేందుకు ముందుకు వచ్చి, చిన్నారి దత్తత తీసుకున్న రోజా నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..!
మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ వైయస్ జగన్మోహన్…
Posted by Roja Selvamani on Sunday, 20 December 2020