TTD : సాలకట్ల బ్రహ్మోత్సవాలు…చక్రస్నానం, శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది.

Ttd

Srivari Chakrasnanam CJI Justice NV Ramana : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 08 గంటల నుంచి 11 గంటల మధ్య శ్రీవారి ఆలయంలో ఐనా మహల్ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ పాల్గొన్నారు.

Read More : TTD : భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. త్వరలో సర్వదర్శనం టోకెన్లు

స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా… ఆలయం వద్ద జస్టిస్ రమణకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద పండితులు ఆశీర్వాదం చేశారు. ఎన్వీ రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, 2022 డైరీ, క్యాలెండర్, టీటీడీ తయారు చేసిన అగరబత్తులను ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి అందజేశారు. శ్రీ వారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు.

Read More : Maoist RK Death : ఆర్కే చనిపోయాడు..అంత్యక్రియలు అయిపోయాయి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు… సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు  న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరాజన్, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, అశోక్ కుమార్, నందకుమార్, లక్ష్మీ నారాయణ, బోరసౌరబ్, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, వీజీవో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.