Maoist RK Death : ఆర్కే చనిపోయాడు.. అంత్యక్రియలు అయిపోయాయి

ఆర్కే మృతిపై మావోయిస్టులు ఓ ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ ప్రకటన విడుదలైంది.

Maoist RK Death : ఆర్కే చనిపోయాడు.. అంత్యక్రియలు అయిపోయాయి

Rk Died Maiost

Maoist Official Statement : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ-ఆర్కే అనారోగ్యంతో మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్‌ అడవీ ప్రాంతంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. తొలుత ఆర్కే మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ కానీ, ఏవోబీ కమిటీ కానీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.

Read More : RK Death : నిజమైన విప్లవకారులకు ఆర్కే ఒక ఉదాహరణ – కళ్యాణ్ రావు

తాజాగా…2021, అక్టోబర్ 15వ తేదీ శుక్రవారం ఆయన మృతిపై మావోయిస్టులు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 14వ తేదీన ఆర్కే మృతి చెందాడని, కిడ్నీలు విఫలమై చనిపోయాడని వెల్లడించారు. ఆయనకు పార్టీ మంచి వైద్యం అందించినప్పటికీ దక్కించుకోలేకపోయిందని, ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యనే అంత్యక్రియలు నిర్వహంచి…శ్రద్ధాంజలి అర్పించడం జరిగిందని వెల్లడించారు. కామ్రేడ్ రామకృష్ణ అమరత్వం పార్టీకి తోరనిలోటుగా అభివర్ణించారు. ఆలకూరపాడులో జరుగుతున్న పరిణామాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read More : Maoist RK : ఆర్కే మృతిపై ప్రకటన విడుదల చేయని మావోయిస్టు కేంద్ర కమిటీ!

ఆర్కే మృతిచెందాడన్న వార్త ఆయన భార్య శిరీషను మరింత కుంగతీసింది. కుమారుడు మృతి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని శిరీష ఆర్కే మృతి చెందారన్న వార్తలను తట్టుకొలేపోతున్నారు. ప్రకాశం జిల్లా ఆలకూరపాడుకు చెందిన విరసం నేత కల్యాణరావు సమీప బంధువు శిరీషను ఆర్కే వివాహమాడారు. ఆమె ఆర్కేతో పాటు ఉద్యమంలో ప‌నిచేశారు. ఉద్యమంలోనే ఆర్కేకు సహాయ సహకారాలు అందిస్తూ… ఆయన వెన్నంటే నడిచారు. వీరిద్దరూ అడవుల్లో కాకుండా డెన్‌లో ఉంటూ… మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను నడిపేవారు. 1991లో ఆర్కే-శిరీష దంపతులకు కుమారుడు మున్నా పుట్టాడు. ఆమె డివిజన్‌కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.

Read More : Maoist Leader RK: చంద్రబాబుపై దాడి కేసు నిందితుడు.. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత

ఉద్యమ సమయంలో ఓవైపు మున్నా… మరోవైపు నెలల కొద్దీ ఆర్కే మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అజ్ఞాతంలోకి వెళ్లడంతో శిరీష తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఉద్యమంలో కీలకంగా ఉన్న భర్తను కలసి వచ్చేందుకు వెళ్లిన శిరీష విశాఖపట్నంలో అప్పట్లో అరెస్ట్‌ అయ్యారు. బెయిల్‌పై విడుదలయ్యాక స్వగ్రామం ఆలకూరపాడు చేరుకొని కుమారుడితో కలిసి సాధారణ జీవితం గడపారు. ఉద్యమం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఆమె టీచ‌ర్‌గా ప‌నిచేశారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. ఆమెపై కూడా ప‌లు కేసులు ఉన్నాయి. ప్రజా సమస్యలపై ఆమె ఇప్పటికీ ఉద్యమాలు చేస్తున్నారు.

PDF File : Statement Comrade RK Death