RK Death : నిజమైన విప్లవకారులకు ఆర్కే ఒక ఉదహరణ – కళ్యాణ్ రావు

దేశంలోని సహజ సంపదలు ప్రజలకు చెందాలనే భావనలే ఆర్కేను విప్లవం వైపు మళ్లించాయని, భూ స్వామ్య వ్యవస్థ ఉండకూడదనే సిద్ధాంతంతో పని చేశారని ఆర్కే తోడల్లుడు, విరసం నేత కళ్యాణ్ రావు తెలిపారు.

RK Death : నిజమైన విప్లవకారులకు ఆర్కే ఒక ఉదహరణ – కళ్యాణ్ రావు

Rk Maiost

Maoist RK Death : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ-ఆర్కే అనారోగ్యంతో మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్‌ అడవీ ప్రాంతంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. ఆయన అసలు విప్లవం వైపు ఎందుకు మళ్లారు ? ఆయన సిద్ధాంతం ఏమిటీ ? తదితర విషయాలను ఆర్కే తోడల్లుడు, విరసం నేత కళ్యాణ్ రావు వివరించారు. 10tvతో ఆయన మాట్లాడారు. దేశంలోని సహజ సంపదలు ప్రజలకు చెందాలనే భావనలే ఆర్కేను విప్లవం వైపు మళ్లించాయని తెలిపారు.

Read More : AP Weather : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భూ స్వామ్య వ్యవస్థ ఉండకూడదనే సిద్ధాంతంతో పని చేశారని, బుగ్గి జీవుల జీవితాల అభివృధ్ధి కోసమే ఆయన పోరాటం చేయడం జరిగిందన్నారు. గుత్తి కేంద్రంగా ఆ రోజు వచ్చిన ప్రజస్వామంయంలో వచ్చిన మార్పుల వల్లే..విద్యార్థుల్లో సిర్పిట్ నింపి రాడికల్స్ వైపు మళ్లించారన్నారు. నిజమైన విప్లవకారులకు ఆర్కే ఒక ఉదహరణ, ప్రజల కోసం జీవించడం..వారి కోసమే మరణించిన ఉన్నతమైన వ్యక్తి గల వ్యక్తిగా అనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.

Read More : TTD : భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. త్వరలో సర్వదర్శనం టోకెన్లు

2004లో ప్రజల కోసం పీపుల్స్ వార్ డిమాండ్లు అంగీకరించే పరిస్థితుల్లో లేదని, అది సక్సెస్ కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయని కళ్యాణ్ రావు తెలిపారు. 40 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన ఆర్కే… ఇక లేరన్న వార్తను మావోయిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతకాలం నుంచి వరుసపెట్టి లీడర్లు మరణించడంతో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు.