TTD : భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. త్వరలో సర్వదర్శనం టోకెన్లు

తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం కానుంది. త్వరలో సర్వదర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

TTD : భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. త్వరలో సర్వదర్శనం టోకెన్లు

Ttd

Updated On : October 15, 2021 / 10:34 AM IST

TTD : తిరుమల శ్రీవారి దర్శనం ఇక సులభం కానుంది. త్వరలో సర్వదర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా కారణంగా సర్వదర్శన టోకెన్లను నిలివేశారు టీటీడీ అధికారులు.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే టికెట్లు జారీ చేస్తున్నారు. చాలామందికి టికెట్లు దొరక్కపోవడంతో స్వామివారిని దర్శనం చేసుకోలేకపోతున్నారు.

చదవండి :  మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

ఇక ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోకి రావడంతో సర్వదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నడకమార్గంలో వచ్చే భక్తులకు తిరుపతిలోనే సర్వదర్శనం టోకెన్లు అందిస్తామని ప్రకటించారు.

చదవండి : శ్రీవారి అన్ని సేవలకూ ఒకే యాప్.. జియోతో టీటీడీ ఒప్పందం