Maoist RK : ఆర్కే మృతిపై ప్రకటన విడుదల చేయని మావోయిస్టు కేంద్ర కమిటీ!

ఆర్కే మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ కానీ, ఏవోబీ కమిటీ కానీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు.

Maoist RK : ఆర్కే మృతిపై ప్రకటన విడుదల చేయని మావోయిస్టు కేంద్ర కమిటీ!

Rk

Updated On : October 15, 2021 / 8:23 AM IST

Maoist Central Committee : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ-ఆర్కే అనారోగ్యంతో మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్‌ అడవీ ప్రాంతంలో అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. అయితే ఆర్కే మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ కానీ, ఏవోబీ కమిటీ కానీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. మావోయిస్టుల అది నాయకత్వంలో అగ్రగణ్యుడయిన ఆర్కే గెరిల్లా ఆర్మీ నిర్మాణంలో, శత్రువులపై దాడి చేయడంలో మాస్టర్‌ మైండ్‌గా పేరు ఉంది. ఆర్కేపై చాలా కేసులున్నాయి.

Read More : AP Govt: సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు.. వచ్చే నెలలోనే ప్రారంభం!

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు. 2004 అక్టోబర్‌ 15న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో ఆర్కే మావోయిస్టుల పక్షాన నాయకత్వం వహించారు. ఆర్కే ఏవోబీ కార్యదర్శిగా ఉన్న సమయంలో ఒడిశాలోని మల్కంగిరి, బలిమెల దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన కుమారుడు మున్నా మరణించారు. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తిచేసిన ఆర్కే.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

Read More : Road Mishap : ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు

పోలీసులు మాత్రం ఆర్కేది సహజ మరణం కావడంతో తమకు ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదని అంటున్నారు. ఆలకూరపాడులో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు.వరుసగా లీడర్ల మరణాలతో మావోయిస్టలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 40 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించిన ఆర్కే… ఇక లేరన్న వార్తను మావోయిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొంతకాలం నుంచి వరుసపెట్టి లీడర్లు మరణించడంతో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు.