Stone pelting case: సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న సతీశ్
Satish To Release: సతీశ్‌ను జైలు నుంచి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

Stone pelting case
ఏపీ జగన్‌పై రాయిదాడి కేసులో నిందితుడు సతీశ్‌కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో సతీశ్‌ను జైలు నుంచి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.
నిందితుడు సతీశ్ ను విడుదల చేయాలంటూ అనుమతి ఇచ్చారు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్. 445 సీఆర్పీసీ పిటిషన్‌ను అనుమతిచ్చి, నిందితుడిని విడుదల చేయాలని చెప్పారు. ఆదివారం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి సతీశ్ విడుదల కానున్నాడు.
కాగా, బెయిల్ మంజూరు వేళ పలు షరతులు విధించింది కోర్టు. ప్రతి శని, ఆదివారాల్లో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలని చెప్పింది. అలాగే, రూ.50 వేలకు ఇద్దరు షూరిటీలు ఇవ్వాలని ఆదేశిస్తూ… ఊరు వదిలి వెళ్లకూడదని తెలిపింది.
కేసులో పోలీసుల విచారణకు సహకరించాలని చెప్పింది. ఎన్నికల వేళ ఏప్రిల్ 13న విజయవాడలో జగన్‌పై రాయి దాడి జరిగింది. జగన్ పై నిందితుడు రాయి విసరడంతో ఆయన కనుబొమ్మ పైభాగంలో అది తాకి గాయమైంది.
Also Read: బీజేపీ మద్దతుతో తెలంగాణ ఏర్పడిందని రేవంత్ రెడ్డి అనేకసార్లు కొనియాడారు: బండి సంజయ్