Secunderabad Riots Subba Rao : ఏపీకి చెందిన వ్యక్తి కావడం వల్లే సుబ్బారావుని బలి చేశారు, లాయర్ సంచలన ఆరోపణలు

అల్లర్లు ఎవరు చేయించారో, అసలు సూత్రధారులు ఎవరో పోలీసులకు తెలుసన్నారు. వారిని వదిలేసి కావాలనే సుబ్బారావుని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.

Secunderabad Riots Subba Rao : సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో కొత్త కోణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులో సంచలన ఆరోపణలు చేశారు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు తరపు న్యాయవాది అలెగ్జాండర్. ఈ అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులే ఈ అల్లర్లకు కారణం అన్నారు. సుబ్బారావుని కావాలనే ఈ కేసులో బలి చేశారని ఆయన ఆరోపించారు.

Agnipath Protest : సుబ్బారావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

అల్లర్లు ఎవరు చేయించారో, అసలు సూత్రధారులు ఎవరో పోలీసులకు తెలుసన్నారు. వారిని వదిలేసి కావాలనే సుబ్బారావుని ఈ కేసులో ఇరికించారని లాయర్ అలెగ్జాండర్ ఆరోపించారు. సుబ్బారావుని ఈ కేసులో ఇరికించడానికి పోలీసులు కట్టుకథ అల్లారని న్యాయవాది అలెగ్జాండర్ అన్నారు. ఏపీకి చెందిన వ్యక్తి కాబట్టే.. సుబ్బారావుని టార్గెట్ చేశారని, పోలీసులు చెబుతున్నట్లు ఒక్క వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయలేదన్నారు.(Secunderabad Riots Subba Rao )

Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..

”గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ప్రకటిస్తే, దాన్ని వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు ముందుంటాయి. దాన్ని ఆసరాగా చేసుకుని ఏదో ఒక హింసను ప్రేరేపించి.. గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఏదో సాధించామనే ఆనందాన్ని పొందే ప్రక్రియ ఇది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ శక్తులు ఇందులో ఎంటర్ అయ్యి ఈ గొడవను పెద్ద గొడవగా సృష్టించాయి. వాళ్లు ఎవరో కూడా పోలీసులకు కూడా తెలుసు. తెలిసినా కూడా వాళ్లను పట్టుకోకుండా సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసులో బలి చేశారు” అని సుబ్బారావు తరపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనుక మాస్టర్ మైండ్ సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావే అని పోలీసులు చెబుతున్నారు. అల్లర్ల వెనుక అసలు సూత్రధారి అతడే అంటున్నారు. ఈ మేరకు ఆధారాలు కూడా సంపాదించామన్నారు. ఆర్మీలో ప్రవేశాలకు కేంద్రం ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకపోవడంతో తనకు రూ.50కోట్ల నష్టం వస్తుందని భయపడ్డ సుబ్బారావు, అభ్యర్థులను రెచ్చగొట్టి కేంద్రం ఎలాగైనా పరీక్ష నిర్వహించేలా ఒత్తిడి తేవాలని ప్లాన్ చేశాడని, ఇందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లకు కారణం అయ్యాడని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు సుబ్బారావుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

కాగా, సుబ్బారావు లాయర్ మాత్రం మరోలా చెబుతున్నారు. సుబ్బారావు అమాయకుడు అంటున్నారు. సుబ్బారావుని బలి చేశారని, అల్లర్ల వెనుక రాజకీయ శక్తుల కుట్ర ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే ఆధారాల్లేవని ఆయన తరఫు న్యాయవాది అలెగ్జాండర్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే ఆయన ఆర్మీ అభ్యర్థులకు సూచించాడని తెలిపారు. 17వ తేదీన అసలు సుబ్బారావు సికింద్రాబాద్‌లో లేడని, బోడుప్పల్‌లోని సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఉన్నాడని చెప్పారు. సుబ్బారావు నేరానికి పాల్పడినట్టు ఆధారాలు లేకపోవడం వల్లనే పోలీసులు ఇన్ని రోజులు అదుపులో ఉంచుకున్నారని న్యాయవాది అన్నారు.

ట్రెండింగ్ వార్తలు