Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నిరసన కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌, మాజీ సైనిక ఉద్యోగి ఆవుల సుబ్బారావును తెలంగాణ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, అతన్ని అదుపులోకి తీసుకోవడానికి కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు వెళ్లింది.

Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..

Subbarao

Secunderabad Protests: ఆర్మీలో నాలుగేళ్ల పాటు పనిచేసే అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ ను అమల్లోకి తెచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. తెలంగాణలోనూ పలువురు యువత కేంద్రం తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలో గత పదిరోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బైఠాయించి రైళ్లను నిలుపుదల చేశారు. అంతటితో ఆగకుండా కొందరు రైళ్లకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనకు సూత్రదారుడు ఆవుల సుబ్బారావుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సుబ్బారావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Health Benefits: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నిరసన కేసులో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌, మాజీ సైనిక ఉద్యోగి ఆవుల సుబ్బారావును తెలంగాణ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అధికారికంగా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు, అతన్ని అదుపులోకి తీసుకోవడానికి కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు వెళ్లింది. అయితే విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావును మంగళవారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు రహస్య ప్రాంతాల్లో విచారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఏడుగురు సుబ్బారావు అనుచరులేనని రైల్వే పోలీసులు ఆధారాలు సేకరించారు. అంతకుముందు సుబ్బారావుతో సహా ఎనిమిది మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే పోలీస్​స్టేషన్​కు తరలించారు. తాజాగా ఆదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించిన తర్వాత సుబ్బారావును న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

అగ్నిపథ్ స్కీంతో ఆర్ధికంగా నష్టపోతామనే భావనతోనే ఆందోళనలకు అకాడమీలు ప్రోత్సాహించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మహాబూబ్ నగర్, కరీంనగర్ కు చెందిన ఇద్దరు అకాడమీ డైరెక్టర్ లు పోలీసుల అదుపులో ఉన్నారు. మరో ఇద్దరు మల్లారెడ్డి, శివ సాయి డిఫెన్స్ అకాడమీ ఉద్యోగులు, రెడ్డప్ప, హారి సహా మరొకరు ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొన్న ట్లు పోలీసులు గుర్తించారు. 12 బ్రాంచ్ ల అకాడమీ అభ్యర్ధులతో ఎనిమిది వాట్సప్ గ్రూప్ ల ఏర్పాటు చేయడంతో పాటు ఎనిమిది వాట్సప్ గ్రూపుల్లో 2వేల మంది యువత ఉన్నట్లు, వారిని ఆందోళనకు ప్రోత్సహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో సుబ్బారావు పలు విషయాలపై నొరువిప్పినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ జరిగితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే ఆధారాల్లేవని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే ఆయన ఆర్మీ అభ్యర్థులకు సూచించాడని తెలిపారు. 17వతేదీ సుబ్బారావు సికింద్రాబాద్‌లో లేడని, బోడుప్పల్‌లోని సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఉన్నాడని చెప్పారు. సుబ్బారావు నేరానికి పాల్పడినట్టు ఆధారాలు లేకపోవడం వల్లనే పోలీసులు ఇన్ని రోజులు అదుపులో ఉంచుకున్నారని సుబ్బారావు తరపు న్యాయవాది పేర్కొన్నారు.