Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..

ఉల్లిపాయ లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉల్లిచేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత కూడా వాడుకలో ఉంది. నిజంగానే ఉల్లిపాయ వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మనల్ని ఇబ్బందిపెట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఉల్లిపాయతో చెక్ పెట్టొచ్చు.

Heart Attack: రోజుకు 100గ్రాముల పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యం పదిలం.. గుండెపోటు దరిచేరదట..

Heart Attack

Heart Attack: ఉల్లిపాయ లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఉల్లిచేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత కూడా వాడుకలో ఉంది. నిజంగానే ఉల్లిపాయ వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మనల్ని ఇబ్బందిపెట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఉల్లిపాయతో చెక్ పెట్టొచ్చు. ఉల్లిపాయను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే అనేక వ్యాధులనుసైతం నయం చేసుకోవచ్చు. రోజుకు 100 గ్రాముల పరిణామంలోగల పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాక పచ్చి ఉల్లిపాయ రోజు తీసుకుంటే అధిక కొవ్వును నియంత్రణలో ఉంచుకోవటమే కాకుండా క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. పచ్చి ఉల్లిపాయ ముక్కలను ఒక నిమిషం పాటు నమిలితే నోట్లోని హానికరమైన బ్యాక్టీరియా తగ్గుతుంది.

Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్

మన ఇంట్లో ప్రతికూరలోనూ ఉల్లిపాయ ఉండాల్సిందే. ఉల్లిపాయ వల్ల శరీరంలోని ముఖ్య భాగాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఉత్తేజరపరుస్తుంది. మనలోని శక్తి సామర్థ్యాలు మెరుగుపరిచి కణాల వృద్ధికి దోహదపడుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు, గుండెపోటు రాకుండా తక్కువ స్థాయి కొవ్వుతో శరీరాన్ని నియంత్రించే లక్షణం ఉల్లిపాయలో ఉంది.

Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

ఉల్లిలో ఉండే కాల్షియం ఎముకలలో సాంద్రత పెంచుతుంది. అంతేకాక మెదడుకు ఒత్తిడి తగ్గిస్తుంది. తెల్ల ఉల్లిపాయలు జట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. అలివ్ ఆయిల్, తెల్ల ఉల్లిరసాన్ని కలిపి వాడితే మరింత మంచిది. ఉల్లి రెండు రకాలుగా ఉంటుంది. ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి మార్కెట్ లో లభిస్తుంది. ఎర్రగా ఉండే ఉల్లిలో కంటే తెల్లగా ఉండే ఉల్లిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెల్ల ఉల్లిని తినడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వారు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫైల్స్ సమస్యను పరిష్కరిండచంలోనూ ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. రోజూ ఉల్లిపాయను ఓ పట్టుపట్టండి.