Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్

టీచర్లు కంట్రోల్ తప్పారు. విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. తొలుత ప్రిన్సిపల్ ఉపాధ్యాయురాలిపై బూటుతో దాడి చేయగా, నేనెందుకు ఊరుకుంటాను అన్నట్లుగా ప్రిన్సిపల్ పై ఉపాధ్యాయురాలు ఎదురుదాడికి దిగింది. అడ్డొచ్చిన వారిని నెట్టిసైతం వారిద్దరు కొట్టుకున్నారు. ఈ తతంగం మొత్తం విద్యార్థులు చూస్తుండగానే చోటు చేసుకుంది.

Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్

Teachers

Viral Video: టీచర్లు కంట్రోల్ తప్పారు. విద్యార్థుల ముందే ఒకరిపై ఒకరు దాడికి దిగారు. తొలుత ప్రిన్సిపల్ ఉపాధ్యాయురాలిపై బూటుతో దాడి చేయగా, నేనెందుకు ఊరుకుంటాను అన్నట్లుగా ప్రిన్సిపల్ పై ఉపాధ్యాయురాలు ఎదురుదాడికి దిగింది. అడ్డొచ్చిన వారిని నెట్టిసైతం వారిద్దరు కొట్టుకున్నారు. ఈ తతంగం మొత్తం విద్యార్థులు చూస్తుండగానే చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ భేరీలోని మహేంగు ఖేరా గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఉపాధ్యాయురాలిపై చెప్పుతో దాడిచేసిన ప్రిన్సిపల్ ను విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

మహేంగుఖేరా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఓ మహిళ టీచర్ పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. ప్రిన్సిపల్ కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా ఎందుకు లేటు వచ్చావంటూ తన బూటు షూతో మహిళ టీచర్ పై దాడి చేశాడు. పక్కనే ఉన్న ఉపాధ్యాయుడు అడ్డుకొనే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకుండా టీచర్ తలపై బూటుతో కొట్టాడు. ఉపాధ్యాయురాలుసైతం ప్రిన్సిపల్ పై దాడి చేసింది. ఈ ఘటన పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్యనే చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కొందరు వీరి కొట్లాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Today Gold Rate: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర!

ఈ ఘటనపై ప్రిన్సిపల్ స్పందిస్తూ.. ఉపాధ్యాయురాలు రోజు కావాలనే ఆలస్యంగా వస్తుందని, పలుసార్లు సంతకం చేసి వెళ్లిపోతుందని, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా తనపై దుర్భాషలాడుతుందని తెలిపాడు. ఆమె తనపై తొలుత చేయిచేసుకుందని అందుకే తాను బూటుతో దాడిచేశానని తెలిపాడు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే మాట్లాడుతూ.. మహిళ టీచర్ పై దాడిచేసినందుకు ప్రిన్సిపల్ అజిత్ వర్మను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.