Today Gold Rate: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర!

పసిడి రేటు పడిపోయింది. నిన్న పెరిగిన బంగారం ధర శనివారం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో జూన్ 25న బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,450(10 గ్రాములు)కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములు రూ.51,760 కు చేరింది.

Today Gold Rate: మహిళలకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర!

Gold Rate

Today Gold Rate: పసిడి రేటు పడిపోయింది. నిన్న పెరిగిన బంగారం ధర శనివారం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో జూన్ 25న బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,450(10 గ్రాములు)కు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములు రూ.51,760 కు చేరింది. కాగా నిన్నటి ధరలతో పోల్చుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200, అదేవిధంగా 24క్యారెట్ల బంగారం రేటు రూ. 230 తగ్గాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ 10 గ్రామలు బంగారంపై రూ. 200కుపైగా తగ్గడం గమనార్హం.

Gold Rates Today : పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 0.09శాతం తగ్గుదలతో ఔన్స్ కు 1828 డాలర్లకు క్షీణించింది. అయితే వెండి ధర మాత్రం పెరిగింది. 0.42 శాతంపైకి చేరింది. ఔన్స్ కు 21.13 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర ఈ వారంలో 0.9శాతం మేర పడిపోయింది. ద్రవ్వోల్బణాన్ని కట్టడి చేయడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్లడం వల్ల బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

Dating App: డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం.. బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.5.81 కోట్లు స్వాహా

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధరలు గత నెల రోజులుగా 1810 నుంచి 1875 డాల్ల శ్రేణిలో కదలాడుతోందని ఎంకాయ్ వెల్త్ మేనేజ్‌మెంట్ తెలిపింది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్ లో వెండి రేటు లో మార్పులేమీ చోటుచేసుకోలేదు. కేజీ వెండి రేటు రూ. 66వేలు ఉంది. ఇక సిల్వర్ రేటు రెండు రోజులుగా స్థిరంగానే ఉంటూ వస్తోంది.