AP New CS : ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్ కె విజయానంద్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు పొడిగించిన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయానంద్ ను నియమించారు. విజయానంద్ 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.
ఏపీకి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం అయ్యారు. ఏపీ నూతన సీఎస్ గా విజయానంద్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయానంద్ సీనియర్ అధికారి. ఈయన తన పదవీ కాలంలో ఎలాంటి వివాదం జోలికి వెళ్లలేదు. మంచి అధికారిగా గుర్తింపు పొందారు. విజయానంద్ సొంత జిల్లా కడప.
Also Read : తమ్మినేని సీతారాం జనసేనలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనతో బొత్స కీలక భేటీ
విజయానంద్ ను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ రిటైర్ కానున్నారు. గతంలోనే ఆయన రిటైర్ అయినప్పటికీ ఆయన సేవలను మరింత ఉపయోగించుకోవాలని, కొంత కాలం ఆయన పదవీ కాలాన్ని ఎక్స్ టెన్షన్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుతో ఆయనను ఎక్స్ టెన్షన్ చేసే గడువు కూడా ముగుస్తుంది. దాంతో ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ కు సీఎస్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. 1వ తేదీ నుంచి ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
Also Read : గతం మర్చిపోయావా..? మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు