JC Prabhakar Reddy : గతం మర్చిపోయావా..? మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు. పవన్ కల్యాణ్ ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయావా ..

JC Prabhakar Reddy : గతం మర్చిపోయావా..? మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Prabhakar Reddy

Updated On : December 29, 2024 / 11:59 AM IST

Perni Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని.. నీ భాగోతాలన్నీ నాకు తెలుసు అంటూ జేసీ హెచ్చరించారు. మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదు. గతంలో చేసినవి అన్నీ మర్చిపోయారా..? జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదా అంటూ ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే వైసీపీ వాళ్లు బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మంచితనం వల్లేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Also Read: వైసీపీ ముందస్తు నిరసనలతో టీడీపీకే లాభమా? వైసీపీ నిరసనలకు అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదా?

వైసీపీ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు. పవన్ కల్యాణ్ ను ఎన్ని మాటలు అన్నారో మర్చిపోయావా పేర్ని నాని. పవన్ కల్యాణ్ కనుసైగ చేస్తే ఎవరూ మిగలరని జేసీ వ్యాఖ్యానించారు. గువాడ నాయకులు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు ఏమైంది మీ సంస్కారం. అప్పుడెందుకు ఆడవాళ్ల జోలికి వెళ్లొద్దు అని మీ నాయకత్వానికి చెప్పలేద అంటూ పేర్ని నానిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచితనంతో కార్యకర్తల చేతులు కట్టేశాడు. లేకుంటే వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చేవారా.. రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతుండేవారా అంటూ జేసీ ప్రశ్నించారు. అయిదేళ్లు మమ్మల్ని బయటకు రానివ్వలేదు. ఆ రోజు కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకెళ్లాడు. నువ్వు ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. నీలాంటి వారిని మాత్రం వదిలిపెట్టేది లేదు. నీకు సంస్కారం లేదు. ఇంకోసారి మీడియా ముందుకొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వీపు విమానం మోగ మోగిస్తా అంటూ పేర్నినానిపై జేసీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ మంత్రివర్గంలో మార్పులు, కొత్తవారికి చోటు? ఇద్దరు అమాత్యులకు ఉద్వాసన పలకబోతున్నారా?

పేర్ని నాని సతీమణి జయసుధ పేరుపై ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం మాయంపై సివిల్ సప్లయ్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పేర్ని నాని సతీమణి జయసుధ, మరొకరిపై పోలీసులు క్రిమినల్ కేసులునమోదు చేశారు. అప్పటి నుంచి పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఈ క్రమంలో వారిపై లుక్ అవుట్ నోటీసులుసైతం జారీ అయ్యాయి. పోలీసులు నమోదు చేసిన కేసుల నుంచి బయటపడేందుకు పేర్ని నాని కుటుంబం కోర్టులకు సైతం వెళ్లింది. అయితే, శనివారం పేర్ని నాని మీడియా ముందుకొచ్చారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం మాపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని ఆరోపించారు.

Also Read: రాజకీయ వైరం ఉన్నా.. చంద్రబాబు ఆ విషయంలో హూందాగా వ్యవహరించారు : పేర్ని నాని

గోడౌన్ లో తగ్గిన బియ్యానికి సంబంధించి డబ్బులుసైతం కట్టామని, కానీ, కావాలని నా సతీమణి, మాపై కేసులు పెట్టి రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పారిపోయినట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబుపై పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు తన భార్యను అరెస్టు చేయించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారని, కానీ, ఆయన హూందాగా వ్యవహరించి.. మైండ్ చెడిందా.. ఆడోళ్లను అరెస్టు చేయడం ఏమిటి? అవసరమైతే పేర్ని నాని, ఆయన కొడుకును అరెస్టు చేసుకోమన్నారని తనకు సమాచారం ఉందని పేర్ని నాని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ ధాన్యం తగ్గిన రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు ఎక్కడ నమోదు చేశారో మంత్రి నాదెండ్ల చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు.

పేర్నినాని వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.. పేర్ని నానిపై తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని అన్నారు. 378 మెట్రిక్ టన్నుల బియ్యానికి రూ. 1.70కోట్లు కట్టమంటే కట్టారు. తరువాత నోటీసులకు పేర్ని నాని స్పందించలేదు. 378 మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడకు వెళ్లాయో ప్రభుత్వానికి తెలియాలి కదా. దానిపై విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేతప్ప.. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునే అవసరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నాకు లేదని నాదెండ్ల మనోహర్ అన్నారు.