వైసీపీ ముందస్తు నిరసనలతో టీడీపీకే లాభమా? వైసీపీ నిరసనలకు అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదా?

తెలంగాణలో కేసీఆర్ ఏడాదికిపైగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైమ్‌ ఇచ్చారు. ఇంకా కూడా ఇస్తున్నారు.

వైసీపీ ముందస్తు నిరసనలతో టీడీపీకే లాభమా? వైసీపీ నిరసనలకు అనుకున్నంత రెస్పాన్స్ రావడం లేదా?

Updated On : December 28, 2024 / 9:47 PM IST

అనువు కాని చోట..అధికులమని ప్రగల్భాలకు పోవద్దు. సమయం, సందర్భం చూసి ముందుకెళ్లాలి. లేకపోతే మన నిర్ణయంతో వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇది రాజకీయాల్లో చాలా అవసరం. అయితే ఏపీలో వైసీపీ ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా అయిందో లేదో అప్పుడే.. నిరసనలు..రాస్తారోకోలు అంటూ పోరు మొదలుపెట్టింది అపోజిషన్. దాంతో ఫ్యాన్‌ పార్టీకి మైలేజ్‌ కంటే డ్యామేజే ఎక్కువ అన్న టాక్ వినిపిస్తోంది. ఓ వైపు పార్టీ క్యాడర్‌ నుంచి ఇంకోవైపు జనం నుంచి సరైన రెస్పాన్స్ రావడం లేదట.

మూడు అంశాలపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ. ధాన్యం కొనుగోళ్లపై నిరసన కార్యక్రమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదట. విద్యుత్ చార్జీల పెంపుపై మాత్రం ప్రొటెస్ట్‌ కాస్త ఫర్వలేదనిపించారు. ఇక జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రొటెస్ట్ చేయబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీను యాక్టివ్ చేయాలని చూస్తోంది వైసీపీ. ఆ తర్వాత జనవరి చివరికి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో అధినేత జగన్ పర్యటనలు ఉన్నాయి.

ఇంటా, బయట డిఫరెంట్ ఓపీనియన్స్
అయితే వైసీపీ నిరసనల కార్యక్రమాలపై ఇంటా, బయట డిఫరెంట్ ఓపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. సమయం, సందర్భం లేకుండా ఏ యాక్టివిటీ చేయొద్దని.. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంపై పోరాడాలి కాబట్టి పోరాడాలని అనుకోవడం సరికాదన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కేసుల భయంతో వైసీపీ లీడర్లు బయటికి రావడం లేదు.

మరోవైపు ఓటమి బాధ నుంచి తెరుకోవడం లేదు. సేమ్‌టైమ్‌ కూటమి ప్రభుత్వంపై ఇంకా ప్రజల్లో వ్యతిరేకత రాలేదని భావిస్తున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. అందుకే ఇప్పుడే నిరసనలు చేపట్టడం సరికాదంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. కనీసం ఏడాది సమయం అయినా ఇచ్చి పోరాడితే బాగుండేదని..గ్రౌండ్ రియాలిటీ ఏంటో తమను అడిగి తెలుసుకోకుండా నిరసనలకు పిలుపునివ్వడం కూడా సరికాదని అంటున్నారట.

కూటమి ప్రభుత్వం మీద జనాలకు అసంతృప్తి బాగా రావాలని అప్పుడే జనంలోకి వెళ్తే ఆందోళనలు విజయవంతమై పార్టీకి మైలేజ్ వస్తుందంటున్నారు లీడర్లు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు చెప్పినా జనంలోకి వెళ్లాల్సిందేనని నేతల మీద ఒత్తిడి పెట్టారట. చేసేదేం లేక నేతలంతా నిరసన బాటపట్టారు.

అంతంత మాత్రమే రెస్పాన్స్
కానీ జనాల నుంచే కాదు లీడర్లు, క్యాడర్ నుంచి కూడా అంతంత మాత్రమే రెస్పాన్స్ వచ్చిందని అసంతృప్తిలో ఉన్నారట. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాలేదని..ప్రజలు ఇంకా ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారని భావిస్తున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. ఇలాంటి టైమ్‌లో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో..జనాల నుంచి పాజిటివ్ ఓపీనియన్ రాకపోగా..వైసీపీ ఓటమిని తట్టుకోలేకపోతుందన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

తెలంగాణలో కేసీఆర్ ఏడాదికిపైగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైమ్‌ ఇచ్చారు. ఇంకా కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి జనాలు రోడ్డుక్కినప్పుడే..ప్రతిపక్షంగా మరింత గట్టిగా గళం వినిపించొచ్చని బీఆర్ఎస్ అధినాయకత్వం గుర్తించిందంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్‌.

కూటమి సర్కార్ పూర్తిస్తాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వైసీపీ జనంలోకి వస్తే బాగుండేది అంటున్నారు. వైసీపీ నిరసనలు ఆ పార్టీకి రాజకీయంగా లాభం చేకూర్చాయా లేక టీడీపీకే ప్లస్‌ అయ్యాయా అంటే..ప్రభుత్వం మీద మాత్రం ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఏం లేదంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో జనం రెస్పాన్స్ ఎలా ఉంటుందో.. వైసీపీ ఎలాంటి వ్యూహరచన చేస్తుందో.

Nitish Reddy Pics: హాఫ్ సెంచరీ చేశాక పుష్ప స్టైల్‌లో తగ్గేదే లే అన్నాడు.. సెంచరీ చేశాక బాహుబలి స్టైల్‌లో రాజసం