Nitish Reddy Pics: హాఫ్ సెంచరీ చేశాక పుష్ప స్టైల్‌లో తగ్గేదే లే అన్నాడు.. సెంచరీ చేశాక బాహుబలి స్టైల్‌లో రాజసం

ఇవాళ హాఫ్‌ సెంచరీ చేసిన తర్వాత నితీశ్ కుమార్‌ తన గడ్డం కింద బ్యాటును పెట్టి తగ్గేదే లే అన్నాడు.

Nitish Reddy Pics: హాఫ్ సెంచరీ చేశాక పుష్ప స్టైల్‌లో తగ్గేదే లే అన్నాడు.. సెంచరీ చేశాక బాహుబలి స్టైల్‌లో రాజసం

©ANI

Updated On : December 28, 2024 / 9:21 PM IST

‘తెలుగు’ సినిమా పేరును ప్రపంచ వ్యాప్తంగా మార్మోగించేలా చేశాయి బాహుబలి, పుష్ప మూవీస్‌. క్రీడా రంగంలోనూ ఇప్పుడు ఓ తెలుగోడి పేరు మార్మోగిపోతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచులో సెంచరీ బాది టీమిండియాను ఆదుకున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డి (21)పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఎనిమిదవ స్థానంలో దిగిన నితీశ్ కుమార్‌ రెడ్డి క్రీజులో నిలదొక్కుకుని, ధాటిగా ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చింది. టిమిండియాకు మరో బ్యాటింగ్ హీరో దొరికాడంటూ సామాజిక మాధ్యమాల్లో అతడి ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

భారత సినిమా చరిత్రలో రికార్డుల మోత మోగించిన బాహుబలి, పుష్ప సినిమాలను.. ఇవాళ క్రికెట్‌లో రికార్డుల మోత మోగించిన తెలుగోడు నితీశ్ కుమార్ మెల్‌బోర్న్‌లో గుర్తు చేశాడు.

Nitish Reddy

పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ తగ్గేదేలే అంటూ గడ్డం కింద చేతిని పెట్టుకుని చెప్పే డైలాగు ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇవాళ హాఫ్‌ సెంచరీ చేసిన తర్వాత నితీశ్ కుమార్‌ కూడా తన గడ్డం కింద బ్యాటును పెట్టి తగ్గేదేలే అన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అంతేగాక, నితీశ్ కుమార్ సెంచరీ చేసిన సమయంలో బాహుబలి సినిమాలోని అమరేంద్ర బాహుబలి పోజును గుర్తు చేశాడు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి చనిపోతున్న సమయంలోనూ రాజసం ఉట్టిపడేలా ఖడ్గాన్ని కుడి చేతి కింద పెట్టుకుంటాడు.

Nitish Kumar Reddy Story

©ANI

అచ్చం అలాగే, ఇవాళ బ్యాటుపై కుడి చేతిని పెట్టి రాజసం ప్రదర్శించాడు నితీశ్ కుమార్‌ రెడ్డి. అమరేంద్ర బాహుబలి స్టైల్‌లో నితీశ్ కుమార్‌ ఈ సంబరాన్ని చేసుకున్న వీడియోలు చిరకాలం అతడికి తీపి జ్ఞాపకంగా ఉండిపోతాయి. తన తండ్రి ముత్యాలుకి కృతజ్ఞతలు తెలిపేలా ఇలా చేశాడు నితీశ్. అతడు సెంచరీ చేసిన సమయంలో ముత్యాలు డగ్-అవుట్‌లో నిలబడి మ్యాచ్ చూశాడు.

Nitish Kumar Reddy : టెస్టుల్లో తొలి సెంచ‌రీ.. నితీష్‌రెడ్డికి ఏసీఏ న‌జ‌రానా.. చంద్ర‌బాబు చేతుల మీదుగా..